Site icon HashtagU Telugu

KTR : యాంకర్ గా మారబోతున్న మంత్రి కేటీఆర్..? What An Idea Sirji !!

KTR Tweet

KTR Election Campaign

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) సరికొత్త వ్యూహాలతో ప్రచారం చేస్తూ హైలైట్ అవుతుంది. సోషల్ మీడియా (Social Media) లో యాక్టివ్ గా ఉండే కేటీఆర్..అదే ఫ్లాట్ ఫామ్ ను బిఆర్ఎస్ ప్రచారానికి వాడుకుంటున్నాడు. మాములుగా ఎన్నికలు వస్తున్నాయంటే అన్ని రాజకీయ పార్టీలు బహిరంగ సభలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారం, ఫ్లెక్సీలు, కరపత్రాలు, పోస్టర్లు ఇలా పలు వాటితో ప్రచారం చేస్తూ ఉండేవారు..కానీ ఇప్పుడు అంత సోషల్ మీడియా హావ నడుస్తుంది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉండడంతో ప్రపంచంలో ఏంజరిగిన క్షణాల్లో కళ్లముందు కనిపిస్తుంది. ఏది మంచో , ఏదో చెడో..ఎవరు ఏంచేస్తున్నారో..ఎలాంటి తప్పులు చేస్తున్నారో ..అసలు ఏం జరుగుతుందో అనేది యిట్టె తెలిసిపోతుంది. అందుకే అధికార పార్టీ బిఆర్ఎస్ పాత పద్దతిలో ప్రచారం చేస్తూనే..సోషల్ మీడియా ను వాడుకుంటూ మరింతగా ప్రజల్లోకి వెళ్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా మంత్రి కేటీఆర్ (KTR) సరికొత్త ఆలోచనలతో దూసుకెళ్తున్నారు. ఓ పక్క నేతలతో , లీడర్స్ తో సమావేశాలు , సూచనలు , ప్రచార వ్యూహాల గురించి చెపుతూనే..మరోపక్క తాను కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎఫ్‌ఎం రేడియో టాక్ షోలు, న్యూస్ చానెల్స్ ఇంటర్వూస్ , యూట్యూబ్ ద్వారా ఓటర్లను ఆకర్షించడం వంటివి చేస్తున్నారు. మొన్నటికి మొన్న ప్రముఖ యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ షో ద్వారా కేటీఆర్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. మై విలేజ్ టీంలో గంగవ్వతో సరదాగా ముచ్చటించడమే కాదు.. రుచికరమైన నాటుకోడి కూరని తయారు చేసి సదరు యూట్యూబర్స్ కి రుచి చూపించాడు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధి నుంచి ఉపాధి అవకాశాల కల్పన వరకు వివిధ అంశాలను వీక్షకులకు కేటీఆర్ వివరించారు. ఈ వీడియో కు మంచి రెస్పాన్స్ రావడమే కాదు సరికొత్త చర్చకు దారితీసింది. ఈ ఐడియా సక్సెస్ కావడం తో ఇదే తరహాలో మరికొన్ని ఇంటర్వ్యూ తో ప్రజల్లోకి వెళ్లాలని కేటీఆర్ డిసైడ్ అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇందులో భాగంగా టాలీవుడ్ బాగా ఫేమస్ అయినా ఇద్దరి హీరోలను ఇంటర్వ్యూ చేయాలనీ చూస్తున్నాడట. సదరు హీరోలను సినిమాల తాలూకా విశేషాలను అడగడం తో పాటు తెలంగాణ అభివృద్ధి , కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ..మరోసారి అధికారంలోకి వస్తే ఇంకెంతలా అభివృద్ధి చేస్తామో వంటివి వారితో చెప్పాలా ప్లాన్ చేస్తున్నాడట కేటీఆర్. ఇప్పటికే దీనికి సంబదించిన పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఎన్నికల పోలింగ్ సమయం వచ్చేలోపు ఈ ఇంటర్వ్యూ ను విడుదల చేయాలనీ చూస్తున్నాడట. ఇప్పటికే పలు సోషల్ మీడియా టీం లను ఏర్పాటు చేసిన కేటీఆర్..వారి చేత సరికొత్త ఆలోచనలు చేయడం..ప్రచారం చేయడం చేస్తున్నారు. మరి ఏ హీరోలతో కేటీఆర్ ఇంటర్వ్యూ చేస్తాడో..చూడాలి.

Read Also : Telangana: అభ్యర్థి గత చరిత్ర చూసి ఓటెయ్యండి: కేసీఆర్