Site icon HashtagU Telugu

KTR : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి కేటీఆర్

Ktr Koushik House

Ktr Koushik House

KTR Visits Kaushik Reddy House : హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Kaushik Reddy ) ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేరుకున్నారు. ఇటీవల కౌశిక్ ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో ఆయనను పరామర్శించారు. గత మూడు రోజులుగా తెలంగాణ (Telangana) లో రాజకీయ వేడి ఏ రేంజ్ లో ఉందో తెలియంది కాదు..బిఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 ఎమ్మెల్యేలు చీర , గాజులు వేసుకొని తిరగాలని కౌశిక్ రెడ్డి అనడం..ఇదే సందర్బంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ (MLA Arikepudi Gandhi) ఇంటికి వెళ్లి బిఆర్ఎస్ జెండా ఎగరవేస్తానని సవాల్ చేయడం పెద్ద దుమారం రేపింది.

దీంతో అరికెపూడి గాంధీ మద్దతుదారులు, కొండాపూర్ లోని కౌశిక్‌ రెడ్డి ఇంటికి వెళ్లి దాడులకు పాల్పడటంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇలా రెండు రోజులుగా బిఆర్ఎస్ vs కాంగ్రెస్ వార్ నడుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ఇదే అంశంపై తాజాగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన పరామర్శించారు.

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అధికార పక్షం చేస్తోన్న దాడులపై తీవ్రంగా స్పందిస్తున్నారు. పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా? ఎటు పోతోంది మన రాష్ట్రం? ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కౌశిక్​ రెడ్డిని గృహ నిర్భందంలో ఉంచి అరికెపూడి గాంధీ గూండాలతో దాడి చేయిస్తారా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేకపోవటమేనా? అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయపరంగా పోరాడుతున్నందునే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారని ఆక్షేపించారు.

సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నారని కేటీఆర్ విమర్శించారు. పోలీసుల సహకారంతో గూండాలను పంపి మ్మెల్యే కౌశిక్ ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు. ఈ దాడికి సహకరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మొన్నటి వరకు పార్టీ మారానని చెప్పిన MLA గాంధీ, ఫిరాయింపులపై కోర్టు తీర్పు రాగానే BRSలోనే ఉన్నానంటూ మాట మార్చారు. దానిని ప్రశ్నించినందుకు దాడి చేస్తారా?’ అని ప్రశ్నించారు.

Read Also : Gold Price Today : వామ్మో ఒక్క రోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర