Site icon HashtagU Telugu

KTR: పేదప్రజల కోసమే తొలి సంతకం..!

Telangana

Ktr

హైదరాబాద్ (Hyderabad) నగరంలో లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ మార్గదర్శకాల ఫైలుపై నూతన సచివాలయంలో తొలి సంతకం మంత్రి కేటీఆర్ (KTR) చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ నూతన సచివాలయ భవనంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి నేడు మంత్రి కేటీఆర్ అడుగుపెట్టబోతున్నారు.

Also Read: Byjus : ఆన్లైన్ ఎడ్యుకేషన్.. బైజుస్ సంస్థపై ఈడీ దాడులు

నూతన సచివాలయం మూడో అంతస్తులోని కార్యాలయం నుంచి మంత్రి కేటీఆర్ ఇకనుంచి తన విధులను నిర్వర్తించనున్నారు. చారిత్రాత్మకమైన నూతన సచివాలయం నుంచి తన విధులను ప్రారంభించనున్న సందర్భంగా మంత్రి అత్యంత కీలకమైన ఫైలుపైన మొదటి సంతకం చేయనున్నారు. హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాల ఫైలుపైన మంత్రి కేటీఆర్ తొలి సంతకం చేయనున్నారు.