Site icon HashtagU Telugu

Phone Tapping Case: సారీ చెప్పండి లేదంటే లీగల్ నోటీసులు పంపిస్తా: కేటీఆర్

Phone Tapping Case

Phone Tapping Case

Phone Tapping Case: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కేసు ముందుకు వెళ్తున్నా కొద్దీ బడా నేతల పేర్లు వెలుగు చూస్తున్నాయి. విచారణ సరిగా జరిపితే ఇందులో కేసీఆర్ హస్తం లేకపోలేదు అంటున్నారు. అయితే తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేటీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తనపై చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొడుతూ లీగల్ నోటీసులకు సిద్ధమయ్యారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు తనపై చేస్తున్న నిరాధార ఆరోపణలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో తన పరువు తీశారంటూ మంత్రి కొండా సురేఖ సహా ముగ్గురు కాంగ్రెస్ నేతలకు ఆయన లీగల్ నోటీసులు జారీ చేయనున్నారు. వాస్తవాలను ధృవీకరించకుండా ఇలాంటి వార్తలను ప్రచురించే వార్తా సంస్థలకు లీగల్ నోటీసులు కూడా అందజేస్తానని కేటీఆర్ తెలిపారు. నిరాధారమైన, అసంబద్ధ ఆరోపణలకు కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

We’re now on WhatsAppClick to Join

కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని, కొంతమంది సినీ ప్రముఖులను కూడా బెదిరించారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ ఆదేశాల మేరకే తమ ఫోన్లు ట్యాప్ చేశారని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కేటీఆర్ ఇటీవల తప్పుడు వార్తలను ప్రసారం చేసి, పరువు నష్టం కలిగించే వివిధ టెలివిజన్ మరియు యూట్యూబ్ ఛానెల్‌లపై చట్టపరమైన చర్యలను ప్రారంభించారు. అందులో భాగంగా మరియు దాదాపు 20 చానళ్లకు నోటీసులు అందించారు.

Also Read: Video : వాష్ రూంకు వెళ్లేందుకు.. ‘స్పైడర్ మ్యాన్’ అయ్యాడు !!