Site icon HashtagU Telugu

Delhi Liquor Scam: చెల్లి కోసం ఈడీ ఆఫీస్‌కు కేటీఆర్..

Delhi Liquor Scam

Delhi Liquor Scam

Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో ఆమె నివాసానికి వెళ్లిన ఈడీ బృందం కవితను అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించింది. ఆ తర్వాత రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా కోర్టు మార్చి 23 వరకు ఈడీ రిమాండ్‌కు పంపింది.

ఈడీ అదుపులో ఉన్న కవితను చూసేందుకు ఈ రోజు కేటీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. కొద్దిసేప్పటి క్రితమే కేటీఆర్ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దేవనపల్లి అనిల్ కుమార్‌తో కలిసి కేటీఆర్ ఢిల్లీకి వచ్చినట్లు సమాచారం. కాగా ఈడీ కార్యాలయానికి కేటీఆర్ ఒంటరిగానే వెళ్లారు. కేటీఆర్ రాకతో ప్రశ్నించేందుకు మీడియా రాగా, కేటీఆర్ సున్నితంగానే తిరస్కరించారు. కారు దిగి నేరుగా మెయిన్ గేట్ ద్వారా ఈడీ కార్యాలయంలోనికి వెళ్ళాడు.

కవిత రిమాండ్ రిపోర్టులో ఎక్సైజ్ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చురుకైన ప్రమేయం ఉందని ఈడీ ఆరోపించింది. దీనికి సంబంధించి సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉంచింది.

Also Read: Cool Drinks: కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త?