Site icon HashtagU Telugu

Telangana: నిర్మల్ లో రూ.1,157 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శంకుస్థాపన

Telangana

Telangana

Telangana: నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిర్మల్ లో రూ.1,157 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు అక్టోబర్ 4న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 714 కోట్లతో చేపట్టిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని కేటీఆర్ ప్రారంభించనున్నారు. 23.91 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం తాగునీటి పథకాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. సోన్ మండలం పోచంపాడ్ గ్రామంలో రూ.250 కోట్ల అంచనాతో ఆయిల్‌పామ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రారంభోత్సవం అనంతరం నిర్మల్‌ పట్టణంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో మంత్రి కేటీఆర్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

 

Also Read: Perni Nani : హరీష్ రావు..చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడం ఫై పేర్ని నాని కామెంట్స్