Site icon HashtagU Telugu

Hyderabad: పాతబస్తీ అభివృద్ధిపై కేటీఆర్ ఫోకస్

Hyderabad (11)

Hyderabad (11)

Hyderabad: హైదరాబాద్ మహా నగరం అభివృద్ధితో పరుగులు పెడుతుంది. ప్రపంచంలోని బహుళజాతి ఐటీ కంపెనీలు నగరానికి క్యూ కడుతున్నాయి. కేవలం ఐటీ రంగమే కాదు ఇతర రంగాల్లోనూ నగరం అభివృధి చెందుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుండటంతో పలు కంపెనీలు నగరం వైపు చూస్తున్నాయి. ఇక నగరంలో మంత్రి కేటీఆర్ రోజుకొక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. పాతబస్తీపై ఫోకస్ చేసిన మంత్రి కేటీఆర్ ఈ శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. శుక్రవారం పాతబస్తీలో పలు కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. రెండు ఐకానిక్ పాదచారుల వంతెనల నిర్మాణాన్ని ఆయన ప్రారంభిస్తారు, ఒకటి 40 కోట్లతో అఫ్జల్‌గంజ్ మరొకటి 29.50 కోట్లతో నయాపూల్, 29.50 లక్షలతో పునరుద్ధరించిన గుల్జార్ హౌజ్‌ను కూడా మంత్రి ప్రారంభించనున్నారు. చార్మినార్ బస్టాండ్‌లో రూ.34.60 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

Also Read: Asian Games 2023: నీరజ్‌ చోప్రాకు స్వర్ణం..