Site icon HashtagU Telugu

Telangana IT HUB: నిజామాబాదులో ఐటీ హబ్..కేటీఆర్ చేతులమీదుగా రేపే ప్రారంభం

Telangana

New Web Story Copy 2023 08 08t142440.907

Telangana IT HUB: తెలంగాణ రాకతో రాష్ట్రంలో ఐటి పరిశ్రమల ఏర్పాటు ఊపందుకుంది. ఐటి మంత్రి కేటీఆర్ చొరవతో ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధి చెందిన బడా ఐటి కంపెనీలు నగరానికి క్యూ కట్టాయి. అమెజాన్ లాంటి బడా సంస్థ హైదరాబాద్ లో హెడ్ క్వార్టర్ ని ఏర్పాటు చేసింది. అయితే ఐటి అంటే కేవలం క్యాపిటల్ లో మాత్రమే ఏర్పాటైతే సరిపోదని, జిల్లా కేంద్రాల్లోనూ పరిశ్రమలు ఏర్పాటు కావాలని, జిల్లా స్థాయిలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో తెలంగాణ గవర్నమెంట్ జిల్లా స్థాయిలో ఐటి హబ్ లను ఏర్పాటుకు సన్నాహాలు చేసింది. ఇప్పటికే పలు జిల్లాలో ఐటి హబ్ లు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు నిజామాబాదు లో ఐటి హబ్ ఏర్పాటు కానుంది.

మంత్రి కేటీఆర్ రేపు బుధవారం ఆగస్టు 9న నిజామాబాద్‌లో కొత్త ఐటీ హబ్‌ను ప్రారంభించనున్నారు. యువతకు కొత్త ఆవిష్కరణలు మరియు నైపుణ్యం పెంపొందించేందుకు ఈ హబ్‌లో ఎంబెడెడ్ టీ-హబ్ మరియు టాస్క్ సెంటర్ కూడా ఉంటాయి. నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, సిద్దిపేట, ఆదిలాబాద్‌లలో ఐటీ హబ్‌లు రానున్నాయని మంత్రి గత ఏడాది ప్రకటించారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లలో ఐటీ హబ్‌లు ఇప్పటికే ఏర్పాటై విజయవంతంగా పనిచేస్తున్నాయని కేటీఆర్ అన్నారు.

Also Read: KTR Conspiracy : థాక్స్ వెనుక కోటానుకోట్ల లాజిక్