ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ సదస్సులో భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) పాల్గొననున్నారు. ఈ సదస్సు జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వేదికగా జరుగనుంది. “భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు” అనే ప్రధాన అంశంతో ఈ ఫోరమ్ ఈ ఏడాది జరగనుంది. దేశవాళీతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు.
ISI Chief Promotion : భారత్‌ను కాపీ కొట్టిన పాక్.. ఐఎస్ఐ చీఫ్‌కు ప్రమోషన్
తెలంగాణలో KTR నేతృత్వంలో అమలైన సాంకేతికత ఆధారిత పాలన, అభివృద్ధి మోడల్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. TS-iPASS, T-Hub, Mission Bhagiratha, T-Works, Dharani Portal వంటి మార్గదర్శక కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేశాయి. ఈ క్రమంలోనే భారత అభివృద్ధికి అవసరమైన సాంకేతిక పరిష్కారాలపై తన దృక్పథాన్ని, అనుభవాలను KTR ఈ సదస్సులో పంచుకోనున్నారు.
ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ సేఠీ మాట్లాడుతూ.. “భారత అభివృద్ధి మంత్రిగా సాంకేతికతను సమర్ధవంతంగా ఉపయోగించిన నాయకుల్లో KTR ఒకరు. అందుకే ఆయనను ఫోరమ్‌కు ముఖ్య వ్యక్తిగా ఆహ్వానిస్తున్నాం” అని పేర్కొన్నారు. తెలంగాణ మోడల్‌ను అంతర్జాతీయ వేదికపై వినిపించే అవకాశం కలిగిన ఈ కార్యక్రమం ద్వారా BRS నేతకు గౌరవం మాత్రమే కాకుండా, రాష్ట్రానికి మన్నన కూడా లభించనుంది.