ప్రస్తుతం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) రాజకీయ వ్యవహార శైలి చూస్తే…ఆయన టార్గెట్ అంత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పైనే ఉన్నట్లు ఎవరికైనా అర్ధమవుతుంది. రేవంత్ ను తప్పిస్తే ఇక మనకు తిరుగుండదని భావిస్తున్నారా..? లేక కాంగ్రెస్ లో రేవంత్ ఒక్కడే మొనగాడు..ఆయనను పార్టీ లో లేకుండా చేస్తే మనల్ని ఎవరు ఆపలేరని భవిస్తున్నారా..? అనేది అర్ధం కావడం లేదు. ఉదయం లేచినదగ్గరి నుండి పడుకునే వరకు మొత్తం రేవంత్ పైనే కేటీఆర్ ఫోకస్ చేస్తూ వస్తున్నాడు. తరుచు సోషల్ మీడియా వేదికగా చేసుకొని రేవంత్ పై విమర్శలు చేయడం , ఆరోపణలు కురిపించడం..రేవంత్ పై రాహుల్ కు పిర్యాదులు చేయడం ఇవన్నీ చేస్తుండడం చూసి ప్రతి ఒక్కరు కేటీఆర్ రేవంత్ కు భయపడుతున్నాడని భావిస్తున్నారు.
వాస్తవానికి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిందంటే అది రేవంత్ రెడ్డి వల్లే అని ఎవర్ని అడిగిన చెపుతారు. టీడీపీ పార్టీ లో కీలక నేతగా ఉండడం..చంద్రబాబు కు దగ్గరిగా ఉండే సరికి ప్రతి ఒక్కరు రేవంత్ కు అభిమానిగా మారిపోయారు. అలాగే రేవంత్ వాక్చాతుర్యము కూడా చాల బలంగా ఉంటుంది. ప్రత్యర్థి ఎంత పెద్దవాడైన..ఎంతటి ధీరుడైన సరే..రేవంత్ తన మాటలతో మాయ చేయడం..హెచ్చరించడం..గట్టిగ తన స్వరాన్ని వినిపించడం చేస్తుంటారు. ముఖ్యముగా కేసీఆర్ లాంటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని ఓడించడంటే..రేవంత్ వ్యాఖ్యలు ప్రజల్లోకి ఎంతగా వెళ్ళాయో అర్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే రాజకీయంగా రోజు రోజుకు ఆయనకు బలాన్ని పెంచుతున్నాయి. అలంటి బలం కాంగ్రెస్ లో లేకపోతే ఇక తిరుగుండదని కేటీఆర్ భావిస్తున్నట్లు అంత మాట్లాడుకుంటున్నారు.
రేవంత్ ను పక్కకు తప్పిస్తే కాంగ్రెస్ పని అయిపోతుందని అనుకుంటున్నారో లేకపోతే రేవంత్ లేకపోతే చాలు కాంగ్రెస్ తో అయినా దోస్తీకి సిద్దమని అంటున్నారో కానీ.. ఆయన రాజకీయం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. గాంధీభవన్‌లో గాడ్సే వారసుడు అంటూ కేటీఆర్ తరచూ చెబుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ కేటీఆర్‌కు పవిత్రంగానే కనిపిస్తోంది. కానీ అందులో రేవంత్ మాత్రమే గాడ్సేలా కనిపిస్తున్నారు. ఆయనను తప్పించాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి రేవంత్ వల్ల కాంగ్రెస్ నష్టపోతుందని రాహుల్ కు ట్యాగ్ చేసి చెబుతున్నారు. రేవంత్ వల్ల కాంగ్రెస్ కు లాభమో.. నష్టమో రాహుల్‌కు తెలియదా… కేటీఆర్ చెప్పాలా ? అనుకునే వారు కూడా ఉన్నారు. అలాగే కొంతమంది సీనియర్స్ కూడా కేటీఆర్ కు వెనుకనుండి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తుంది. రేవంత్ అంటే పడని వారు కాంగ్రెస్ లో చాలామందే ఉన్నారు. కాకపోతే వీరంతా బయటకు రేవంత్ మా వాడే అన్నట్లు ఉన్న..వెనుకాల మాత్రం రేవంత్ ను తప్పించాలని , అసలు కాంగ్రెస్ లో లేకుండా చేయాలనీ భావించే వారు లేకపోలేదు. అందుకే రోజు రోజుకు కేటీఆర్..రేవంత్ పై తన స్వరాన్ని పెంచుకుంటూ పోతున్నాడని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ ను తప్పిస్తుందా..? అంత సాహసం చేస్తుందా..? కేటీఆర్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంటుందా..? అనేది చూడాలి.
Read Also : Hydrogen Engines : ఇక విమానాల కోసం ‘హైడ్రోజన్’ ఇంజిన్లు.. రెడీ చేస్తున్న సైంటిస్టులు