Site icon HashtagU Telugu

KTR Jibe At Modi: వెల్ డన్ మోదీజీ….అచ్చే దిన్ అంటే ఇదేనా..కేటీఆర్ వ్యంగ్యాస్త్రం..!!

Ktr Imresizer (1)

Ktr Imresizer (1)

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అచ్చేదిన్ పిలుపునకు సోమవారంతో 8 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా విమర్శలు చేశారు. మోదీ అచ్చే దిన్ కు ఎనిమిది ఏళ్ల నిండాయన్న కేటీఆర్…ఈ 8ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఏం సాధించింది అని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.

ఈ 8 ఏళ్లల రూపాయి విలువ అత్యంత కనిష్టస్థాయికి చేరిందన్నారు. 45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం దాపురించిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక 30ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం చేరిందని ప్రపంచంలోనే అత్యధిక ఎల్పీజీ ధరలు దేశంలోనే ఉన్నాయన్నారు. 42ఏళ్లలో అత్యంత దారుణ స్థితికి ఆర్థిక వ్యవస్థ దిగజారిందని కేటీఆర్ పేర్కొన్నారు.

బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటకలో కరెంటు కోతలపై కేటీఆర్ స్పందించారు. బెంగుళూరు-మైసూరు రోడ్డులోని కుంబగోడు పారిశ్రామిక ప్రాంతంలోని వ్యాపారులు బెంగళూరు ఎలక్ట్రిసిటి సప్లయ్ కంపెనీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. శక్తి లేని డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు.

Exit mobile version