Site icon HashtagU Telugu

Formula E-Race Case : కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

Ktr

Ktr

ఫార్ములా- ఈ కార్ రేసింగ్ కేసు(Formula E-Race Case)లో ఈనెల 6న విచారణకు రావాలని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కు ఏసీబీ నోటీసులు (ACB Notice) జారీ చేసింది. తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు నిధుల బదిలీ, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా జరిగిన లావాదేవీలపై ఏసీబీ ప్రశ్నించనుంది. కేటీఆర్‌ను ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.

High Blood Pressure : మీకు హైబీపీ ఉందా..? అయితే ఈ ఆహారం అస్సలు తినొద్దు..!

ఏసీబీ కేటీఆర్‌ను ప్రశ్నించనున్న విషయాల్లో ముఖ్యంగా నిధుల బదిలీకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు..? మంత్రి వర్గం అనుమతి తీసుకోకపోవడానికి గల కారణాలు..? రేసింగ్ నిర్వహణలో ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించబడ్డాయి..? వంటి అంశాలపై దృష్టి పెట్టనుంది. ఈ కేసు పూర్వాపరాలపై ఏసీబీ లోతుగా దర్యాప్తు చేపట్టనుంది. ఫార్ములా-ఈ కేసులో మరో కీలక సంస్థ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కూడా రంగంలోకి దిగింది. ఈ నెల 7వ తేదీన కేటీఆర్‌ను ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. కేసు దర్యాప్తులో ఈడీ, ఏసీబీ కలిసి పని చేస్తున్నట్లు సమాచారం. విదేశీ నిధుల బదిలీపై ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది. తనపై నమోదు చేసిన ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్వాష్ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు రిజర్వులో పెట్టింది. తీర్పు వచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయకూడదని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.

ప్రస్తుతం ఫార్ములా-ఈ కేసు కారణంగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ కేసును ప్రతిపక్ష పార్టీలు కావాలని రాజకీయం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు.