Site icon HashtagU Telugu

TG Assembly : ఒకే రోజు 19 ప‌ద్దుల‌పై చర్చ ఎందుకు – కేటీఆర్ సూటి ప్రశ్న

Ktr Sridar

Ktr Sridar

తెలంగాణ శాసనసభ సమావేశాలు (Telangana assembly session) వాడి వేడిగా కాదు ఏకంగా గంటల తరపడి జరుగుతున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు మొదలైన చర్చ మంగళవారం తెల్లవారుజాము 3 గంటల 15 నిమిషాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా బడ్జెట్​లో 19 పద్దులకు శాసనసభ అమోదం తెలిపింది. ఈ సమావేశంలో పద్దులపై వివిధ పార్టీల సభ్యులు చర్చలో పాల్గొనగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ సమాధానం చెప్పారు. ఈ క్రమంలో బడ్జెట్​లోని 19 పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ 19 పద్దులపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్(KTR) శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల మంత్రి శ్రీధర్ బాబు కు సలహా ఇచ్చారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే స్పీక‌ర్ అనుమ‌తితో కేటీఆర్ మాట్లాడారు. ఒకే రోజు 19 ప‌ద్దుల‌పై చ‌ర్చ జ‌రిపి అప్రూవ్ చేసుకోవాల‌నే ఉద్దేశంతో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున‌ 3 గంట‌ల వ‌ర‌కు స‌భ‌ను న‌డిపారు. సుదీర్ఘ ప్ర‌సంగాలు చేయొద్ద‌న్న శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల మంత్రి ప్ర‌తిపాద‌న‌ను అంగీక‌రిస్తున్నాము. కానీ ఈ స‌భ‌లో 57 మంది కొత్త స‌భ్యులు ఉన్నారు.. వారంద‌రూ మాట్లాడాల‌ని అనుకుంటున్నారు. ఇలా రోజుకు 19 ప‌ద్దుల‌పై చ‌ర్చ పెట్ట‌కుండా.. రోజుకు 2 లేదా 3 ప‌ద్దుల‌పైన చ‌ర్చ పెట్టాల‌ని కోరుతున్నాం. ఈ స‌మావేశాలు అయిపోయాయి. కానీ వ‌చ్చే అసెంబ్లీ, బ‌డ్జెట్ స‌మావేశాల్లో రోజుకు 19 ప‌ద్దులు పెట్ట‌కుండా, 2 లేదా 3 ప‌ద్దుల‌పై సావ‌ధానంగా చ‌ర్చ జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాలి అని కోరారు. ఇక ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్, పురపాలక, పరిశ్రమలు, ఐటీ, ఎక్సైజ్, హోం, కార్మిక, ఉపాధి, రవాణా, బీసీ సంక్షేమం, విద్య, వైద్య – ఆరోగ్య శాఖల పద్దులపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. తాము ఇచ్చిన కోత తీర్మానాలను మంత్రుల విజ్ఞప్తి మేరకు బీఆర్ఎస్​ సభ్యుడు హరీశ్ రావు, బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్ ఉపసంహరించుకున్నారు. అనంతరం పద్దులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

Read Also : Friendly Police : తెలంగాణలో బ‌రితెగించిన పోలీసులు..సామాన్య ప్రజలపై జులం