KTR Spot : రేవంత్ రెడ్డి చీక‌టి కోణంపై కేటీఆర్ ఫోక‌స్

రేవంత్ రెడ్డి మీద రాజ‌కీయ దాడికి బీఆర్ఎస్ ( KTR Spot) దిగుతోంది. అసెంబ్లీ లోప‌ల‌, బ‌య‌ట ప‌లు ఆరోప‌ణ‌ల‌ను మంత్రి కేటీఆర్ చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - August 10, 2023 / 04:15 PM IST

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద మూకుమ్మ‌డి రాజ‌కీయ దాడికి బీఆర్ఎస్ ( KTR Spot) దిగుతోంది. అసెంబ్లీ లోప‌ల‌, బ‌య‌ట ప‌లు ఆరోప‌ణ‌ల‌ను మంత్రి కేటీఆర్ చేస్తున్నారు. సేమ్ టూ సేమ్ గ‌తంలో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్లు అధిష్టానంకు ఇచ్చిన ఫిర్యాదుల మాదిరిగా ఆ ఆరోప‌ణ‌లు ఉండ‌డం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ నాయ‌కుడి చీక‌టి చ‌రిత్ర మొత్తం తెలుసంటూ మంత్రి కేటీఆర్ చుర‌క‌లు వేశారు. కానీ, బ‌య‌ట పెట్ట‌డానికి మాత్రం ముందుకు రాక‌పోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

రేవంత్ రెడ్డి మీద మూకుమ్మ‌డి రాజ‌కీయ దాడికి బీఆర్ఎస్ ( KTR Spot)

స‌మాచార హ‌క్కు చ‌ట్టం అంద‌రికీ ఉప‌యోప‌డేలా యూపీఏ ప్ర‌భుత్వం తీసుకొచ్చింది. దానికి మ‌రింత ప‌దును పెడుతూ ప్ర‌భుత్వంలోని అవినీతి, అక్ర‌మాలను అడ్డుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని రూట్ టూ మ‌నీ కింద మార్చేశార‌ని మంత్రి కేటీఆర్ వేసి అభాండం. దాని మీద అసెంబ్లీలోని కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఎవ‌రూ డిఫెండ్ చేయ‌లేదు. ఏ విధంగా రేవంత్ రెడ్డి ఆర్డీఐ యాక్ట్ కింద స‌మాచారం సేకరించి అధికారులను బ్లాక్ మెయిల్ చేశారు? కాంట్రాక్ట‌ర్ల ద‌గ్గ‌ర‌కు ఎంత మంది ద‌గ్గ‌ర‌కు వెళ్లారు? అనేది తెల‌సంటూ మంత్రి  ( KTR Spot) చుర‌క‌లు వేశారు. ప్ర‌భుత్వం చేసే ప్ర‌తి ప‌నిలోనూ అవినీతి ఉంద‌ని రేవంత్ రెడ్డి చెప్ప‌డాన్ని త‌ప్పుబ‌డుతూ ఒక ర‌కంగా రేవంత్ రెడ్డి బ‌ట్ట‌లు ఊడ‌దీసేలా మాట్లాడారు.

స‌మాచార హ‌క్కు చ‌ట్టం, రూట్ టూ మ‌నీ

అసెంబ్లీ లోప‌ల మంత్రి కేటీఆర్ ఎలాంటి ఆరోప‌ణ‌లు చేశారో, అవే గ‌తంలోనూ రేవంత్ రెడ్డి మీద స్వ‌పక్షంలోని కొంద‌రు, ప్ర‌త్య‌ర్థులు చేశారు. మునుగోడు ఎన్నిక‌ల సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి చ‌రిత్ర‌ను కోమ‌ట‌రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విప్పారు. ఆ త‌రువాత కూడా కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ రేవంత్ రెడ్డి ఆర్థిక మూలాల‌ను వ‌ద‌ల్లేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంకు కూడా ఫిర్యాదు చేసిన‌ట్టు వెల్ల‌డించారు. ఇదే త‌ర‌హాలో కాంగ్రెస్ సీనియ‌ర్లు కొంద‌రు రేవంత్ రెడ్డి మీద బ్లాక్ మెయిల‌ర్ అంటూ ఆరోప‌ణ‌ల‌కు దిగిన సంద‌ర్భాలు అనేకం. ఇక పార్టీని వీడి వెళ్లే వాళ్లు చేసిన ఆరోప‌ణ‌లు కూడా ఇలాంటివే. ప్ర‌త్యేకించి దాసోజు శ్రావ‌ణ్ అనేక ఆరోప‌ణ‌లు చేస్తూ పార్టీని వీడారు. ఒక. చీక‌టి డాన్ మాదిరిగా రేవంత్ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సీరియ‌స్ ఆరోప‌ణ‌లు చేశారు. మాఫియాను ( KTR Spot) న‌డుపుతున్నార‌ని విరుచుకుప‌డ్డారు.

Also Read : BRS Point : అసెంబ్లీలో రేవంత్ ప‌వ‌ర్, చంద్ర‌బాబు క‌ల్చ‌ర్

వాస్త‌వంగా రేవంత్ రెడ్డికి ఎలాంటి వ్యాపారాలు పెద్ద‌గా లేవు. పారిశ్రామిక‌వేత్త అంత‌కంటే కాదు. కేవ‌లం రాజ‌కీయ నాయ‌కునిగానే ఎదిగారు. కుటుంబ నేప‌థ్యం కూడా ఆర్థికంగా మామూలుగానే ఉంద‌ని స‌ర్వ‌త్రా తెలుసు. కానీ, కేవ‌లం `15 ఏళ్ల‌లో వేల కోట్లు ఎలా వ‌చ్చాయి? అనేది కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ సూటిగా అప్ప‌ట్లో వేసిన ప్ర‌శ్న‌. బంజారాహిల్స్ లో విలాస‌వంత‌మైన ఇంటిని ఎలా నిర్మించారు? అనేది కూడా చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. దానిపై మంత్రి మ‌ల్లా రెడ్డి ప‌లుమార్లు మాట్లాడారు. ఆయ‌న బిడ్డ వివాహం ఖ‌ర్చు కూడా మ‌ల్లారెడ్డి లేవ‌నెత్తిన సంద‌ర్భాలు అనేకం. ఇలా..ఎవ‌రు ఆరోప‌ణ‌లు చేసిన‌ప్ప‌టికీ బ్లాక్ మెయిలర్ రేవంత్ రెడ్డి అనే కోణంలోనే చేస్తున్నారు. తాజాగా అసెంబ్లీ లోప‌ల ఆన్ రికార్డ్ మంత్రి కేటీఆర్ ( KTR Spot) కూడా అలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

Also Read : KTR Conspiracy : థాక్స్ వెనుక కోటానుకోట్ల లాజిక్

సాధార‌ణంగా ప్ర‌భుత్వంలో ఉండే వాళ్లు ఆరోప‌ణ‌ల‌ను నిరూపించాలి. వాటి మీద విచార‌ణ జ‌రిపించాలి. ఒక వేళ బ్లాక్ మెయిల్ చేసిన‌ట్టు ఆధారాలు ఉంటే చ‌ర్య‌లు తీసుకోవాలి. ఇదేమీ లేకుండా, మిగిలిన వాళ్ల మాదిరిగా మంత్రి కేటీఆర్ ఆన్ రికార్డ్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మీద ఆరోప‌ణ‌ల‌కు దిగారు. ఇప్పుడు వాటిని నిరూపించాల్సిన బాధ్య‌త కేటీఆర్ మీద ఉంది. అంతేకాదు, ఎవ‌రెవ‌రు వ‌ద్ద రేవంత్ రెడ్డి ఎంత తీసుకున్నారు? అనేది కూడా తేల్చాలి. ఆఫీస‌ర్ల‌ను ఎంత మందిని బ్లాక్ మెయిల్ చేశారు? కాంట్రాక్టర్లు ఎంత మంది వద్ద‌కు ఆయ‌న వెళ్లారు? అనేది చెప్పాలి. లేదంటే, తెలంగాణ స‌మాజం మిగిలిన లీడ‌ర్ల జాబితాలో మంత్రి కేటీఆర్ ను కూడా వేసేయ‌డం ఖాయం.!