NTR statue in Khammam : మాకు రాముడైనా, కృష్ణుడైనా ఎన్టీఆరే – KTR

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ ఎంతో ఆప్తుడు నంద‌మూరి తార‌క రామారావు. ఎవ‌రు ఎన్ని ర‌కాల చ‌రిత్ర‌లు రాసినా.. కొన్ని చెరిగిపోని స‌త్యాలు ఉంటాయి

  • Written By:
  • Publish Date - September 30, 2023 / 01:45 PM IST

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ ఎంతో ఆప్తుడు నంద‌మూరి తార‌క రామారావు (NTR) అని.. ఎవ‌రు ఎన్ని ర‌కాల చ‌రిత్ర‌లు రాసినా.. కొన్ని చెరిగిపోని స‌త్యాలు ఉంటాయి. అందులో భార‌త‌దేశంలో తెలుగు వారున్నార‌ని ఎలుగెత్తి, చాటిచెప్పింది నంద‌మూరి తార‌క‌రామ‌రావు మాత్ర‌మే అని అన్నారు మంత్రి కేటీఆర్ (KTR).

మంత్రి కేటీఆర్ నేడు ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో పర్యటిస్తున్నారు. ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలికాఫ్టర్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో (Minister Prashant Reddy) కలిసి నేరుగా ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తికి చేరుకొని గుబ్బగుర్తి ఆయిల్‌ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అనంతరం ఖ‌మ్మంలోని ల‌కారం ట్యాంక్‌బండ్‌పై రూ. 1.37 కోట్ల‌తో నూత‌నంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్కు స‌హా విగ్ర‌హాన్ని (NTR Statue Inauguration) మంత్రి పువ్వాడ అజ‌య్‌తో క‌లిసి కేటీఆర్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంద‌రికీ ఎంతో ఆప్తుడు నంద‌మూరి తార‌క రామారావు. ఎవ‌రు ఎన్ని ర‌కాల చ‌రిత్ర‌లు రాసినా.. కొన్ని చెరిగిపోని స‌త్యాలు ఉంటాయి. అందులో భార‌త‌దేశంలో తెలుగు వారున్నార‌ని ఎలుగెత్తి, చాటిచెప్పింది మాత్రం ఒక్క నంద‌మూరి తార‌క‌రామ‌రావు గారి అని కేటీఆర్ అన్నారు. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన మ‌హా నాయ‌కుడు ఎన్టీఆర్అని, రాముడు అంటే ఎలా ఉంటాడో ఎవరికీ తెలియ‌దు.. కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియ‌దు.. మాకు రాముడైనా, కృష్ణుడైనా ఆయ‌నే. భార‌త‌దేశంలో తెలుగు వారంటూ ఉన్నార‌ని గుర్తించేలా చేసింది ఎన్టీఆరే. చ‌రిత్ర‌లో మ‌హ‌నీయుల స్థానం ఎప్ప‌టికీ చిర‌స్మ‌ర‌ణీయంగా ఉంటుంది. ఆయ‌న విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించే అవ‌కాశం రావ‌డం త‌న అదృష్ట‌మ‌న్నారు. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని దేశ వ్యాప్తంగా చాటి చెప్పారు. ద‌క్షిణ భార‌త‌దేశంలో అన్న ఎన్టీఆర్ స‌హా ఇప్ప‌టి వ‌ర‌కూ హ్యాట్రిక్ ఎవ‌రూ కొట్ట‌లేదు. అది సీఎం కేసీఆర్‌కు త్వ‌ర‌లో సాధ్య‌మ‌వుతుంద‌ని మంత్రి కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు.

Read Also : Jagan Sketch Change : వైసీపీకి బ్రాహ్మణి భ‌యం! లోకేష్ అరెస్ట్ లేన‌ట్టే?