BRS Sweda Patram : కాంగ్రెస్ శ్వేత పత్రాల మీద కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

కాంగ్రెస్ ‘శ్వేత పత్రానికి’ ధీటుగా బీఆర్ఎస్ ‘స్వేదపత్రం’ (Sveda Patras) విడుదల చేసింది. వాస్తవానికి శనివారం ఉదయం 11 గంటలకు స్వేద పత్రాన్ని విడుదల చేస్తామని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power Point Presentation) చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ట్విట్టర్లో ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఈ కార్యక్రమం ఈరోజుకు వాయిదా పడింది. ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్‌ఎస్‌ తొమ్మిదిన్నరేల్ల పాలనపై ఆయన ‘స్వేదపత్రం’ పేరుతో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ […]

Published By: HashtagU Telugu Desk
Telangana

Telangana

కాంగ్రెస్ ‘శ్వేత పత్రానికి’ ధీటుగా బీఆర్ఎస్ ‘స్వేదపత్రం’ (Sveda Patras) విడుదల చేసింది. వాస్తవానికి శనివారం ఉదయం 11 గంటలకు స్వేద పత్రాన్ని విడుదల చేస్తామని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power Point Presentation) చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ట్విట్టర్లో ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఈ కార్యక్రమం ఈరోజుకు వాయిదా పడింది. ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్‌ఎస్‌ తొమ్మిదిన్నరేల్ల పాలనపై ఆయన ‘స్వేదపత్రం’ పేరుతో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ను కేటీఆర్ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా రిలీజ్ చేసిన వైట్ పేపర్‌లోని గణాంకాలకు కౌంటర్‌గా బీఆర్ఎస్ ఈ ప్లానింగ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఉద్దేశపూర్వకంగా బీఆర్‌ఎస్‌ పార్టీని, గత పది సంవత్సరాల కేసీఆర్‌ నాయకత్వంలో పరిపాలనను బద్నాం చేసే విధంగా ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించే విధంగా, బురద చల్లే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. శాసనసభలో మా పార్టీ నాయకులు జగదీశ్వర్‌రెడ్డి, హరీశ్‌రావు, పార్టీ తరఫున నేను గాని ప్రభుత్వం మా మీద చేసే ఆరోపణలు, కొన్ని కువిమర్శలకు ధీటుగా సమాధానం చేసిన కాబట్టే మాకు సావధానంగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గొంతునొక్కింది’ అంటూ కేటీఆర్ ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

గతపదేళ్లు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం జరిగింది ? ఎట్లా జరిగింది ? ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అందుకే స్వేదపత్రాన్ని విడుదల చేస్తున్నాం. పదేళ్లు చమటోడ్చి, రక్తాన్ని రంగరించి.. వందల, వేల గంటలు పనిచేసి ఒక్క మా ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం మాత్రమే కాదు.. లక్షల మంది ఉద్యోగులు, కోట్ల మంది ప్రజలు తమ స్వేదంతో, తమ కష్టంతో ఈ రాష్ట్ర అభ్యున్నతికి తోడ్పడ్డారో.. ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారో చెప్పాల్సిన బాధ్యత ఈ స్వేదపత్రం ద్వారా మీ మీద ఉన్నది. ఎక్కడికి చేరుకున్నమో తెలియాలి అంటే.. ఎక్కడ మొదలయ్యామో కూడా గుర్తుపెట్టుకోవాలి’ అని కేటీఆర్ అన్నారు. 60 ఏళ్లలో జరిగిన జీవన విధ్వంసం ఒకవైపు అయితే.. మరి నేరపూరిత నిర్లక్ష్యంతో ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యంతో మన రాష్ట్రాన్ని నాశనం చేసే, జీవన విధ్వంసం చేసే ప్రయత్నం అప్పటి పాలకులు చేశారు. అది కాంగ్రెస్‌ పాలకులు కావొచ్చు. ఇతరులు కావొచ్చు. వారి వివక్ష వల్ల శిథిలమైన ప్రాంతం.. పక్షపాతంతో చిక్కిశల్యమైన ప్రాంతం మన తెలంగాణ. అందుకే మాటల్లో కంటే కూడా.. ఆనాటి ఫ్రీ లాన్స్‌ జర్నలిస్ట్‌ ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం నుంచి ప్రేరణ పొంది ఆయన ‘తెలంగాణ స్టిల్‌ సీకింగ్‌ జస్టిస్‌’ పేరుతో ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. దాన్ని చూస్తే చూస్తే కళ్లకు కట్టినట్లు అర్థమవుతుంది’ అని కేటీఆర్ తెలిపారు.

Read Also : TSRTC : ఆర్టీసీ బస్సులో కండక్టర్‌ చేతివాటం..బస్సు ఎక్కకపోయినా 10 నుంచి 20 టికెట్లు ఇష్యూ

  Last Updated: 24 Dec 2023, 12:21 PM IST