KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామరావు (కేటీఆర్) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్టులో, రేవంత్ ఇప్పటివరకు ఢిల్లీకి చేసిన పర్యటనలు 50 సార్లు చేరుకున్నాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ, ఈ యాత్రలతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదని మండిపడ్డారు.
కేటీఆర్ తన పోస్ట్‌లో కాంగ్రెస్ పాలనను కడిగిపారేశారు. “ఈ ప్రభుత్వం ఫైల్స్‌తో రాష్ట్రాన్ని నడపడం లేదు. ఫ్లైట్ బుకింగ్స్‌తోనే పాలన కొనసాగుతోంది,” అని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై వ్యంగ్యాస్త్రాలు ప్రయోగిస్తూ, “కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి చేసిన మూడు ప్రధాన పనులు ఇవే: మొదటిది – ఫ్లైట్ టికెట్ బుక్ చేయడం; రెండోది – ఢిల్లీకి వెళ్ళడం; మూడోది.. ఖాళీ చేతులతో తిరిగి రావడం..” అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలోని ప్రజా సమస్యలను పక్కనబెట్టి, ముఖ్యమంత్రి తరచూ ఢిల్లీకి వెళ్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. “రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లేదు. పొలాల్లో జల్లడానికి యూరియా లేదు. సాగు నీళ్లు రావు, తాగునీళ్లు కూడా లేవు,” అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
“కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎత్తిపోతల మరమ్మతు పనులను ఆపేస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ శాశ్వత నష్టం పొందుతుంది అనే అవగాహన కూడా ఈ ప్రభుత్వానికి లేదు,” అని వ్యాఖ్యానించారు.
Asthma : చికిత్స ఉన్నా పిల్లల్లో ఆస్తమా ముదిరే కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు
అదేవిధంగా, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, నాలుగు వేల రూపాయల పెన్షన్, తులం బంగారం హామీలు, గురుకుల విద్యార్థుల సమస్యలు అన్నీ నిర్లక్ష్యం చెయ్యబడ్డాయని కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేయడంపై కేటీఆర్ మరింత వ్యంగ్యంగా స్పందించారు. “రాష్ట్ర సమస్యలపై శ్రద్ధ చూపే సమయం లేని ముఖ్యమంత్రి, 3 రోజుల్లో 3 ఫ్లైట్‌లు ఎక్కుతూ ఢిల్లీ వెళ్తున్నారు. వస్తున్నారు. కానీ ఆయన యాత్రల ఫలితం ఏమిటి?” అని ప్రశ్నించారు.
“ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు – హస్తిన యాత్రలు ఇప్పటికి 50 సార్లకు చేరుకున్నాయి. కానీ రాష్ట్రానికి తెచ్చింది ఏమీ లేదు.. శుష్కప్రియాలు, శూన్య హస్తాలు… అయినా పోయి రావలె హస్తినకు.. ఈ ఢిల్లీ యాత్రలతో తెలంగాణకు లభించింది ఏమిటి?” అని ప్రశ్నించారు.
“నో ప్రాజెక్ట్, నో ఫండింగ్, నో ప్యాకేజీ… తెలంగాణకు అవసరమైనది రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి. ఢిల్లీ యాత్రలు చేసే టూరిస్ట్ సీఎం కాదు,” అంటూ కేటీఆర్ తన వ్యాఖ్యలను ముగించారు.
Tesla : టెస్లాకు షాక్.. రూ.2,100 కోట్ల భారీ జరిమానా విధించిన ఫ్లోరిడా కోర్టు