KTR : కాంగ్రెస్ దరిద్ర పాలన కావాలా..? 24 కరెంటు కావాలా..? మీరే తేల్చుకోండి – కేటీఆర్

సిరిసిల్ల నియోజకవర్గం నంబర్ వన్ గా చేశానని, అప్పుడు ముస్తాబాద్ ఎలా ఉండే ఇప్పుడు ముస్తాబాద్ ఎలా ఉంది ఆలోచన చేయాలన్నారు

Published By: HashtagU Telugu Desk
ktr sircilla election campaign

ktr sircilla election campaign

తెలంగాణ ఎన్నికల ప్రచారం (Telangana Election Campaign)లో భాగంగా బిఆర్ఎస్ నేతలు (BRS Leaders) దూకుడు కనపరుస్తున్నారు. ముఖ్యంగా అధినేత కేసీఆర్ (KCR) , మంత్రులు కేటీఆర్ (KTR) , హరీష్ రావు (Harish Rao)లతో పాటు కవిత లు ఇలా ఫ్యామిలీ మొత్తం ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ గా పర్యటిస్తూ కాంగ్రెస్ , బిజెపిలఫై విమర్శలు కురిపిస్తూ..మరోసారి బిఆర్ఎస్ కు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇక కేటీఆర్ అయితే ఏ ఫ్లాట్ ఫామ్ ను వదిలిపెట్టడం లేదు. సోషల్ మీడియా , న్యూస్ చానెల్స్ , యూట్యూబ్ చానెల్స్ ఇలా అన్నింట్లో బిఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే రోడ్ షో లు , నియోజకవర్గాలలో పర్యటిస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా (KTR Sircilla Election campaign) ముస్తాబాద్ మండల కేంద్రంలో రోడ్‌ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మీరు దీవిస్తే ఎమ్మెల్యే అయ్యాను, కెసిఆర్ ఆశీర్వదిస్తే మంత్రిని అయ్యానని తెలిపారు. బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎంతగా అభివృద్ధి జరిగిందో చెప్పాల్సిన పనిలేదు. అలాగే సిరిసిల్ల నియోజకవర్గం నంబర్ వన్ గా చేశానని, అప్పుడు ముస్తాబాద్ ఎలా ఉండే ఇప్పుడు ముస్తాబాద్ ఎలా ఉంది ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ దరిద్ర పాలన కావాలో.. 24 కరెంటు కావాలో మీరే తేల్చుకోండన్నారు. అలాగే కాంగ్రెస్ కు బంపర్ ఆఫర్ ఇస్తున్న ముస్తాబాద్ రండి ఎప్పుడు వస్తారో చెప్పండి అని ఆయన సవాల్‌ విసిరారు. నేను బస్ ఆరంజ్ చేస్తా వచ్చి మండలంలో కరెంటు వైర్లు పట్టుకొని చూడండి కరెంటు ఉందో లేదో తెలుస్తుంది…అని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

Read Also :   National Herald Case : రాహుల్, సోనియా గాంధీకి ఈడీ షాక్..

  Last Updated: 21 Nov 2023, 09:48 PM IST