Site icon HashtagU Telugu

Phone Tapping Case : మంత్రి కొండా సురేఖ కు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు..

KTR Tweet

KTR interesting tweet on the party changing leaders

ఫోన్‌ ట్యాపింగ్‌ (Phone Tapping) విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖతోపాటు మరో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) లీగల్ నోటీసులు పంపించారు. గత కొద్దీ రోజులుగా రాష్ట్రం లో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం హయాంలో పెద్ద ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ గా చేస్తున్నారు. ఈ తరుణంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనపై కాంగ్రెస్‌ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, వారికి లీగల్‌ నోటీసులు పంపిస్తానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంగళవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

‘నా పరువుకు భంగం కలిగేలా ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రికి లీగల్ నోటీసులు పంపిస్తా. నిరాధారమైన, సిగ్గు పడాల్సిన అరోపణలు చేసినందుకు వారు నాకు క్షమాపణలు చెప్పాలి. లేదా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వాస్తవాలను తెలుసుకోకుండా వార్తలు రాస్తున్న న్యూస్ ఔట్ లెట్లకు కూడా లీగల్ నోటీసులు పంపిస్తా’ అని ట్వీట్ చేశారు. ఇక ఈరోజు చెప్పినట్లు మంత్రి కొండా సురేఖ (Konda Surekha)తోపాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి (MLA Yennam Srinivas Reddy), కాంగ్రెస్‌ నేత కేకే మహేందర్‌ రెడ్డికి కేటీఆర్‌ నోటీసులు పంపించారు.

ఇదిలా ఉంటె ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకు సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా టాస్క్‌ఫోర్స్ ముసుగులో వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. 2023 అసెంబ్లీ ఎన్నికలతో పాటు దుబ్బాక, హుజుర్‌నగర్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పోలీసు వాహనాల్లో డబ్బు తరిలించినట్లు కేసులో నిందితుడుగా ఉన్న మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు పోలీసు కస్టడీలో ఒప్పుకున్నాడు. ఈ మేరకు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ కేసు మరో మలుపు తిరిగే అవకాశం ఉంది.

Read Also : Chandrababu: ఏపీలో 40 డిగ్రీలకు పైగా ఎండలు.. పెన్షన్ కోసం సచివాలయాలకు రమ్మనడం సరికాదు: చంద్రబాబు