CM Revanth Reddy : జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్న జేబు దొంగ రేవంత్ రెడ్డి – కేటీఆర్

లోక్ సభ ఎన్నికల తర్వతా బీజేపీలో చేరే మెదటి వ్యక్తి రేవంత్ రెడ్డినేనని .. అందుకే రాహుల్ గాంధీకి భిన్నంగా ప్రధాని మోడీని బడే భాయ్ అంటున్నారన్నారు

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 04:51 PM IST

లోక్ సభ (Lok Sabha) ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో తెలంగాణ (Telangana) లో ఎన్నికల వేడి సమ్మర్ ను మించుతుంది. ముఖ్యముగా బిఆర్ఎస్ (BRS) ను టార్గెట్ గా చేసుకున్న రేవంత్..వరుస పెట్టి అక్కడి నేతలను తమ పార్టీలోకి చేరుకుంటూ బిఆర్ఎస్ ఖాళీ చేస్తారా నేటి అని అంత అనుకునేలా చేస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైతే వలసల పర్వం కొనసాగిందో..ఇప్పుడు అంతకు మించి అనే రీతిలో వలసలు నడుస్తున్నాయి. కేసీఆర్ (KCR) వెంట పదేళ్ల పాటు నమ్మకంగా తిరిగిన వ్యక్తులు సైతం ఇప్పుడు రేవంత్ వెనుకలకు వస్తుండడం తో ఎవర్ని నమ్మాలో..నమ్మకూడదో అర్ధం కానీ పరిస్థితి లో బిఆర్ఎస్ అధిష్టానము ఉంది. ఇలాంటి ఈ తరుణంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR)..సీఎం రేవంత్ రెడ్డి ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి..బిజెపి లో చేరబోతారని జోస్యం తెలిపి షాక్ ఇచ్చారు. ఈ దేశంలో కాంగ్రెస్ 40 సీట్లు కూడా దాటే ప‌రిస్థితి లేదు. ఇక‌ ఆ త‌ర్వాత వెంట‌నే జంప్ అయ్యే వ్య‌క్తి ఈ దేశంలో ఎవ‌రైనా ఉన్నారంటే.. ఇదే రేవంత్ రెడ్డి.. ఇది రాసిపెట్టుకోండి అని కేటీఆర్ సూచించారు.

తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో మంగళవారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమవేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. లోక్ సభ ఎన్నికల తర్వతా బీజేపీలో చేరే మెదటి వ్యక్తి రేవంత్ రెడ్డినేనని .. అందుకే రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి భిన్నంగా ప్రధాని మోడీని బడే భాయ్ అంటున్నారన్నారు. జీవితమంతా కాంగ్రెస్ లోనే ఉంటా అని ఏనాడు అనడం లేదని కేటీఆర్ గుర్తు చేశారు. రూ.2500 కోట్లను ఢిల్లీకి రేవంత్ రెడ్డి పంపారని, జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్న జేబు దొంగ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అని మండిపడ్డారు. కాంగ్రెస్ కు బీజేపీని ఆపే దమ్ము లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి విచిత్రంగా ఉందని.. అక్కడా రాహుల్ గాందీ చౌకిదార్ చోర్ అంటే, రేవంత్ మాత్రం బడే భాయ్ బాగుండు అంటారన్నారు. అక్కడ అదానీ మంచోడు కాదు అంటే రేవంత్ రెడ్డి మాత్రం మంచోడు అంటాడని.. అక్కడ రాహుల్ గాందీ, గుజరాత్ మాడల్ దుర్మార్గం అంటే ఇక్కడ మా బడేభాయ్ మాడల్ బాగుందని రేవంత్ అంటుండని మండిపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో రైతుబంధు, క‌రెంట్ ఇవ్వ‌డానికి చేత‌కాదు. ఆడపిల్ల‌ల పెళ్లిళ్ల‌కు తులం బంగారం ఇస్తామ‌ని ఇవ్వ‌డం లేదు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెట్టి ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని లీక్‌లు ఇస్తున్నాడు. ఏమ‌న్న త‌ప్పు జ‌రిగితే విచార‌ణ చేయ్.. త‌ప్పు చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకో.. ఇక్క‌డ భ‌య‌ప‌డేటోళ్లు ఎవ‌రూ లేరు. 100 రోజుల్లో ఏ ఒక్క ప‌ని చేయ‌లేదు. రైతులు చ‌స్తుంటే, పొలాలు ఎండుతుంటే చ‌ర్య‌లు లేవు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు పైస‌లు కావాల‌ని రైస్ మిల్ల‌ర్ల‌ను, బిల్డ‌ర్ల‌తో స‌హా అంద‌ర్నీ బెదిరిస్తున్నారు. ఇదంతా బ‌య‌ట‌కు రాకుండా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని లేవ‌నెత్తిండు అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు దానం నాగేంద‌ర్. ఒక‌టే మాట చెబుతున్నా. రాజ‌కీయాల్లో హ‌త్య‌లు ఉండ‌వు.. ఆత్మ‌హ‌త్య‌లు ఉంటాయి. త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటే ఖ‌త‌మై పోతారు. అధికారం కోసం ఆశ‌ప‌డి, గెలిపించిన ప్ర‌జ‌ల‌కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు దానం. ఖైర‌తాబాద్ ప్ర‌జ‌లు బ్ర‌హ్మాండ‌మైన నిర్ణ‌యం తీసుకుని తీర్పు ఇస్తార‌నే విశ్వాసం ఉంది. దానం అవ‌కాశవాద రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఖైర‌తాబాద్ ప్ర‌జ‌లు తెలుసుకున్నారు. ఆనాడు ఆసిఫ్‌న‌గ‌ర్‌లో దానం నాగేంద‌ర్ టీడీపీ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్‌లోకి వ‌చ్చారు. మ‌ళ్లీ ఉప ఎన్నిక‌లో ఓడిపోయారు. ఇప్పుడు కూడా అదే పున‌రావృతం కాబోతోందన్నారు.

రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం మంచిది కాదు.. అక్క‌డ ఓ కాలు, ఇక్క‌డ ఓ కాలు వేస్తే ఎటు కాకుండా అయిత‌ది. దానంను అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాల‌ని స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశాం. దానం నాగేంద‌ర్‌ను ఎంపీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డంతో అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నాం. రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు స్పీక‌ర్ లోనైతే, వ‌దిలిపెట్ట‌కుండా సుప్రీంకోర్టుకు వెళ్తాం.. దానంను అన‌ర్హుడిగా చేసేదాకా పోరాడుతం అన్నారు.

Read Also : YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్‌ఆర్‌సిపి