హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ (BRS) మాత్రం ఈ అంశాన్ని వదలకుండా పట్టుకుని రాజకీయంగా వినియోగించుకుంటున్నట్టు కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా కేటీఆర్ (KTR) తరచూ HCU అంశాన్ని ప్రస్తావిస్తూ ఉండటం చర్చనీయాంశమవుతోంది. ఈ వ్యవహారంపై స్టూడెంట్స్ పెద్దగా స్పందించకపోయినా, కొందరు మాత్రమే బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తుండగా, మెజారిటీగా విద్యార్థులు ఆ పార్టీపై నమ్మకం లేకుండా ఉన్నారని తెలుస్తోంది.
Hanuman : హనుమంతుడు లేని రామయ్య గుడి ఎక్కడో ఉందో తెలుసా..?
HCU లో గుర్తింపు పొందిన విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీల జోక్యాన్ని స్పష్టంగా తిరస్కరించాయి. తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటామని తేల్చిచెప్పిన విద్యార్థులు, బీఆర్ఎస్ ప్రయత్నాలను నిరుత్సాహపరిచారు. అయినప్పటికీ బీఆర్ఎస్ ఈ అంశాన్ని మద్దతు కవ్వింపుగా మలచుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. విద్యార్థుల సమాధానం స్పష్టంగా ఉన్నప్పటికీ, బిఆర్ఎస్ మాత్రం పాత మాటలతో మళ్లీ మళ్లీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది.
ఇంత రాజకీయ ప్రాధాన్యత ఎందుకు చూపుతున్నారన్నదానిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 130 ఎకరాల HCU భూమిని TNGO కు అప్పగించారని, దీనిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సంబంధముందని ఆరోపణలు రావడంతో, ఈ వ్యవహారం మరింత గంభీరతను సంతరించుకుంది. ఈ ఆరోపణలు బయటకు రాకుండా ఉండేందుకు కేటీఆర్ అసలు పాయింట్‌ను మళ్ళించి, ఇతర కోణాల్లో రాజకీయంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరి నిజంగా అదేనా..? లేక మరో కారణం ఏమైనా ఉందా అనేది తెలియాలి.