KTR : దేవెగౌడ మనవడు పారిపోయేందుకు మోడీ సర్కారు సాయం : కేటీఆర్

KTR : మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ కొడుకు హెచ్‌డీ రేవణ్ణ,  మనవడు ప్రజ్వల్ రేవణ్ణలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వ్యవహారంపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ స్పందించారు. 

Published By: HashtagU Telugu Desk
Ktr

Ktr

KTR : మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ కొడుకు హెచ్‌డీ రేవణ్ణ,  మనవడు ప్రజ్వల్ రేవణ్ణలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వ్యవహారంపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ స్పందించారు.  ఈ అంశంపై ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ చేసిన ట్వీట్‌కు ఆయన స్పందించారు. మహిళల పై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనకు సంబంధించిన వార్తలు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని ఆయన చెప్పారు. మహిళలను లైంగికంగా వేధించిన ప్రజ్వల్.. దేశం విడిచి ఎలా పారిపోగలిగాడని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజ్వల్ దేశం విడిచి పారిపోయేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా లభించి ఉండొచ్చని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ప్రజ్వల్ దేశం విడిచి పారిపోవడం సాధ్యపడదని కామెంట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

ఒకవేళ ప్రజ్వల్‌కు సహకారం అందించి ఉండకుంటే.. వెంటనే కేంద్ర ప్రభుత్వం అతడిని అరెస్టు చేసి తీసుకొచ్చి చట్టప్రకారం శిక్షించాలని కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు. ‘‘మణిపూర్‌లో మహిళలపై జరిగిన అఘాయిత్యాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. బిల్కిస్ బానో రేపిస్టులను జైలు నుంచి వదిలేశారు. బ్రిజ్ భూషణ్ సింగ్ పై మహిళ రెజర్లు చేసిన ఆరోపణలను మోడీ సర్కారు పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రజ్వల్ రేవణ్న మహిళను వేధించాడని తెలిసి కూడా అతన్ని దేశం బయటికి సాగనంపారు’’ అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళల భద్రతకు సంబంధించిన వ్యవహారాల్లో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోంది అనడానికి ఈ వరుస ఉదంతాలేని నిదర్శనమని కేటీఆర్ చెప్పారు.

Also Read :TSRTC Discount : హైదరాబాద్ టు విజయవాడ, బెంగళూరు ఆర్టీసీ టికెట్లపై డిస్కౌంట్

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం సంచలనంగా మారింది.   ప్రజ్వల్ ఓ మహిళతో ఉన్న వీడియోలు కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. తాజాగా ప్రజ్వల్ తండ్రి, మాజీ మంత్రి రేవణ్ణపై కూడా లెంగిక వేధింపుల కేసు నమోదైంది. రేవణ్ణ తనను, అతడి కొడుకు ప్రజ్వల్ తన కూతురిని లైంగికంగా వేధించేవారని వారి ఇంట్లో పనిచేసే వంటమనిషి ఆరోపిస్తోంది. తాజాగా ప్రజ్వల్ వ్యవహారం బయటపడటంతో ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదుచేసినట్లు ఆమె పేర్కొంది. దీంతో ఇప్పటికే కొడుకుపై లైంగిక వేధింపుల కేసు నమోదవగా, తాజాగా తండ్రిపైనా కేసు నమోదయ్యింది. రేవణ్ణ భార్య భవానితో బంధుత్వం కలిగిన ఓ మహిళ ఇటీవలే వారి ఇంట్లో వంటమనిషిగా చేరింది. అయితే తనపై రేవణ్ణ లైంగికంగా వేధిస్తున్నాడని సదరు మహిళ ఆరోపిస్తోంది.  తన కూతురికి వీడియో కాల్ చేసి ప్రజ్వల్ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని సదరు వంటమనిషి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

  Last Updated: 29 Apr 2024, 01:13 PM IST