Site icon HashtagU Telugu

KTR : పౌర సరఫరాల శాఖలో భారీ స్కామ్.. మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు

Ktr

Ktr

KTR : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ పౌర సరఫరాల శాఖలో భారీ స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు. ధాన్యం అమ్మకాల కోసం జనవరి 25న పిలిచిన గ్లోబల్ టెండర్లలో అవకతవకలు జరిగాయన్నారు. ధాన్యానికి క్వింటాకు దాదాపు రూ.150 నుంచి 223 రూపాయల దాకా అదనంగా చెల్లించాలని రాష్ట్రంలోని రైస్ మిల్లర్లను బెదిరించారని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వంతో  సంబంధం లేని నాలుగు ప్రైవేట్ సంస్థలు రైస్ మిల్లర్లపై ఈ బెదిరింపులకు దిగాయన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్నులకు  200 రూపాయలు చొప్పున అంటే దాదాపు రూ.700 కోట్ల వరకు మనీలాండరింగ్ ద్వారా మోసం జరుగుతోంది. కుంభకోణాల కుంభమేళా జరుగుతోంది’’ అని కేటీఆర్ (KTR) చెప్పారు. కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే దోపిడీకి పాల్పడటం మొదలుపెట్టిందని ఆయన చెప్పారు. 15 రోజుల క్రితమే ఈ కుంభకోణాన్ని బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టినా ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదని ఆయన చెప్పారు. ఈ కుంభకోణంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. తాము లేవనెత్తిన ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదని కేటీఆర్ పేర్కొన్నారు.

Also Read :Heat Wave : వామ్మో.. అక్కడ 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

‘‘బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కామ్‌లు.. గల్లీమే లూటో, ఢిల్లీలో బాటో అన్నదే కాంగ్రెస్ నీతి.. కాంగ్రెస్ అంటే కుంభకోణాల కుంభమేళా. ధాన్యం సేకరణపైన దృష్టి పెట్టకుండా రైతన్నల నుంచి సేకరించిన ధాన్యంపైన కన్ను వేసి  స్కాంకి, అవినీతి చీకటి దందాకు కాంగ్రెస్ సర్కారు తెరలేపింది’’ అని  కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో B టాక్స్, U టాక్స్, ఆర్ఆర్ టాక్స్ రాజ్యమేలుతుందన్నారు. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఢిల్లీ పెద్దల ప్రమేయం కూడా ఉందని కేటీఆర్ తెలిపారు. హామీల అమలు విషయంలో చూపించని జెట్ స్పీడును.. అవినీతి సొమ్ము కోసం కాంగ్రెస్ పెద్దలు చూపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలా కూడగట్టిన అవినీతి సొమ్మునే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టిందన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, ఎఫ్‌సీఐ స్పందించకుంటే.. తాము న్యాయపోరాటం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.

Also Read : IPL Betting : ఇవాళే ఐపీఎల్ ఫైనల్.. హైదరాబాద్ అడ్డాగా బెట్టింగ్స్ జోరు

Exit mobile version