Site icon HashtagU Telugu

CM Revanth Reddy : కేటీఆర్ కు సీఎం రేవంత్ సవాల్..

Cm Revanth Savel To Ktr

Cm Revanth Savel To Ktr

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) కు సవాల్ విసిరారు. కేటీఆర్ కు దమ్ముంటే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించాలని సవాల్ చేసారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో సీఎంతో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకగాంధీ పర్యటనరద్దు కావడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టి చేవెళ్ల ప్రాంతానికి నీళ్లు రాకుండా చేసిందని మండిపడ్డారు. తమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్టును నిపుణులు, ఇంజినీర్లు వద్దంటున్నా.. మేడిగడ్డ వద్ద కట్టారన్నారు. అద్భుతంగా కట్టామని కేసీఆర్‌ చెప్పిన ప్రాజెక్టులు ఈరోజు పగుళ్లు పట్టాయని, రూ. లక్ష కోట్ల నిధులు గోదావరిలో పోసి వృథా చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు అడ్రెస్ లేకుండా కొట్టుకుపోతాయని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

‘ఎన్నికల ముందు రేవంత్ సీఎం అని చెబితే 3 సీట్లు కూడా వచ్చేవి కావని కేటీఆర్ అంటున్నారు. నీకు చేతనైతే, దమ్ముంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించు. మేము అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు. కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి.. ఎవరికీ భయపడకుండా, లొంగకుండా ఈ కుర్చీలో కూర్చున్నాం’ అని పేర్కొన్నారు.

అంతకు ముందు సచివాలయంలో గృహ జ్యోతి పథకం కింద రేషన్‌కార్డు ఉన్నవారికి నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ హామీలను ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వల్ల పథకాల ప్రారంభ వేదిక మార్చినట్లు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Read Also : CM Jagan: కుప్పం నుంచే మెజారిటీ ప్రారంభం కావాలి: సీఎం జగన్