తెలంగాణ మాజీ మంత్రి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR).. కాంగ్రెస్ పార్టీ (Congress Party)పై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరియు సీఎం రేవంత్ (CM Revanth) రెడ్డిని సవాలు చేస్తూ, వారిని అశోక్ నగర్‌కు వచ్చి తెలంగాణలో ఉద్యోగాలపై వివరణ ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో 1,60,083 ఉద్యోగాలు అందించామని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారనే విషయంపై వారు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ల ఫలితాలు ప్రస్తుతం విడుదలవుతున్నాయనీ, కానీ కాంగ్రెస్ పార్టీ వాటిని కూడా తమ ఖాతాలో వేసుకుని క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. “దమ్ముంటే అశోక్ నగర్‌కు వచ్చి ఈ అంశంపై చర్చించండి” అని కేటీఆర్..సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. ఇక కేసీఆర్ నాయకత్వంలో జీవో 55 తీసుకొచ్చామని , ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు న్యాయం జరగాలని, ఓపెన్ కోటాలో కూడా రిజర్వ్‌డ్ వారికి అవకాశం కల్పించే విధంగా జీవో ను తీసుకొచ్చామని గుర్తుచేశారు. జీవో 29పై తాము జూన్, జులై నుంచి మొత్తుకుంటున్నాం. శాసనసభలో హరీశ్‌రావు మాట్లాడారు. ప్రెస్‌మీట్ పెట్టి ఆర్ఎస్పీ, దాసోజు శ్రవణ్ పలుమార్లు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు వైఖరి వల్ల గందరగోళాల మధ్య పరీక్ష నిర్వహించారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
Read Also : Press Release : మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక..