Site icon HashtagU Telugu

KTR: వ్యంగ్యంగా మంత్రి కేటీఆర్ ట్వీట్…బండి సంజయ్ ను ఈడీ చీఫ్ గా నియమించినందుకు కృతజ్ఞతలు..!!

Ktr

Ktr

TRS-CM KCRలపైనా ఈడీ దాడులు జరుగుతాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను టీఆరెస్ మంత్రి కేటీఆర్ ఖండించారు. బీజేపీని, బండి సంజయ్ ను ఎగతాళి చేస్తూ ప్రధానిమోదీని ఉదేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు.

BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ఈడీ చీఫ్ గా కూడా నియమించినందుకు సంతోషంగా ఉంది. దేశాన్ని నడిపిస్తుందంటున్న డబుల్ ఇంజన్ మోదీ-ఈడీ అన్నది ఈ వ్యాఖ్యలతో స్పష్టంగా అర్థం అవుతోందని ట్వీట్ లో పేర్కొన్నారు కేటీఆర్. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఓ ఇంగ్లీష్ పేపర్ లో వచ్చిన క్లిప్పింగ్ ను తన ట్వీట్ యాడ్ చేశారు కేటీఆర్.

ఇక వయోవృద్ధులకు రైళ్లలో రాయితీలను ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కేటీఆర్ తప్పు బట్టారు. పెద్దలను జాగ్రత్తగా చూసుకోవడం మని విధి అంటూ..రైళ్లలో రాయితీ అంశాన్ని పున సమీక్షించాలని రైల్వే శాఖ మంత్రి కోరారు కేటీఆర్.