Site icon HashtagU Telugu

KTR Satires: కాంగ్రెస్ మేనిఫెస్టోపై కేటీఆర్ సెటైర్స్

KTR Satires

KTR Satires

KTR Satires: కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను “వంచన” గా పేర్కొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలోని అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్, బిఆర్‌ఎస్ శాసనసభ్యుల ఫిరాయింపులపై కేటీఆర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు.

‘న్యాయ్ పాత్ర’ పేరుతో సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే మేనిఫెస్టోలో భాగంగా ఫిరాయింపుదారులకు చోటు లేదని పేర్కొంటూ, అలాంటి వారిని అనర్హులుగా ప్రకటిస్తామని మేనిఫెస్టోలో పోందుపర్చింది కాంగ్రెస్. అయితే ఇదే విషయంపై కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో వంచనగా అభివర్ణిస్తూ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన నేతలను అనర్హులుగా ప్రకటించాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మరియు ఎన్నికల కమిషన్‌కు పదేపదే విజ్ఞప్తులు చేసినప్పటికీ, ఈ ఫిరాయింపుదారులపై అనర్హత వేటుకు సంబంధించి నిశ్శబ్దంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. దీని కారణంగా ప్రజాస్వామ్య సూత్రాల పట్ల నిబద్ధతపై సందేహాలు లేవనెత్తుతుంది అని కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలకు ముందు తెలంగాణకు చెందిన ఇద్దరు శాసనసభ సభ్యులు, ముగ్గురు పార్లమెంటు సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియన్‌ శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య మార్చి 30న కాంగ్రెస్‌లోకి ఫిరాయించడంతో కావ్యకు కాంగ్రెస్ ఎంపీ టిక్కర్ లభించింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్‌లోకి మారారని కేటీఆర్ ఎత్తి చూపారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ముగ్గురు బీఆర్‌ఎస్ ఎంపీలు-చేవెళ్ల రంజిత్ రెడ్డి, పెద్దపల్లెకు చెందిన వెంకటేష్ నేత బోర్లకుంట, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ తెలంగాణలో అధికార కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు.

We’re now on WhatsAppClick to Join

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయినప్పటి నుంచి తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికార పార్టీలోకి ఫిరాయింపుల పరంపరను చూసింది. మరో ఇద్దరు బీఆర్‌ఎస్ ఎంపీలు కూడా బీజేపీలో చేరారు. అయితే కెసిఆర్ కూడా 2014 నుండి 2023 వరకు అనేకమంది ఇతర పార్టీ నాయకులను తన పార్టీలోకి ఆహ్వానించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లకు గాను 88 సీట్లు గెలుచుకున్న కేసీఆర్, 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 12 మందిని తన వైపుకు లాక్కున్నారు.

Also Read: SRH vs CSK: ఉప్పల్ లో పోలీసులకు, ఫ్యాన్స్ మధ్య గొడవ