Site icon HashtagU Telugu

KTR: రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటుంది: కేటీఆర్

Ktr Response On Assembly El

Ktr Response On Assembly El

రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటుంది  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జిహెచ్ఎంసి పరిధిలోని పార్టీ కార్పొరేటర్లతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం జరిగింది. తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

‘‘60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయోమయంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఉన్న 13 కార్యక్రమాలతో పాటు ఇచ్చిన, 420 హామీలకు అమలుకు 57 వేల కోట్లు మాత్రమే బడ్జెట్ లో కేటాయించింది. మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళా సోదరీమణులకు ఇవ్వాల్సిన మొత్తమే 50వేల కోట్ల పైన అవుతుంది. మరి రైతుబంధు, ఆసరా, రుణమాఫీ వంటి పథకాల అమలకు ఎక్కడి నుంచి నిధులు తెస్తారో బడ్జెట్లో చెప్పలేదు. ఫార్మసిటీ, మెట్రో విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులను రద్దు చేయడం వలన రాష్ట్ర అభివృద్ధి కూడా దెబ్బతినే అవకాశం ఉంది’’ కేటీఆర్ మండిపడ్డారు.

‘‘అభివృద్ధి దెబ్బతింటే, రాష్ట్రానికి రాబడి, రెవెన్యూ తగ్గే ప్రమాదం ఉన్నది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపైన దృష్టి పెట్టకుండా, కేవలం ప్రజలను తప్పు దోవ పట్టించే అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నాలను ప్రజలు ఎక్కువ రోజులు నమ్మరు. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి.. రాజకీయ కారణాలతో అవకాశం రాకున్నా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశారు. ప్రతి ఒక్క కార్పొరేటర్, పార్టీ శ్రేణులు చేసిన కృషి వల్లనే ఈరోజు హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయగలిగింది. గత పది సంవత్సరాలలో ప్రతిరోజు పార్టీ కార్పొరేటర్లు ప్రజల్లో నిలబడి మరీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేలా చూశారు’’ అని కేటీఆర్ అన్నారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశాలతో నగర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. జిహెచ్ఎంసి పాలకవర్గం బాధ్యతలను నిర్వహించడంలో ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రజా పాలన అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసి జనరల్ బాడీ సమావేశం జరగకుండ, స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు కాకుండా ఆపుతుంది. రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఐదు అంచెల పరిపాలన వ్యవస్థలో భాగంగా ఏర్పాటైన స్థానిక ప్రభుత్వం జిహెచ్ఎంసి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని కేటీఆర్ మండిపడ్డారు.