Telangana: కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. భారతదేశంలో భూగర్భ జలాలు పెరగడానికి తెలంగాణయే కారణమని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో చిన్న పొరపాటు జరిగితే ప్రాజెక్టు మొత్తం గల్లంతవుతోందని చెప్పిన ఆయన ఈ ప్రాజెక్టు ద్వారా 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీలో తప్పు జరిగితే సరిచేయండి. కాళేశ్వరంపై న్యాయ విచారణను స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఆరోపణలు చేస్తున్నట్టుగా నిజంగా తప్పు జరిగితే చర్యలు తీసుకోండని స్పష్టం చేశారు. మాపై కోపంతో రాష్ట్ర పరువు తీయకండి. ఇప్పటికే 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి పనులను పూర్తి చేసి నీళ్లు ఇవ్వండి. ప్రాజెక్టులను పాడుచేయవద్దు అంటూ సూచించారు. మారుమూల ప్రాంతాల్లోని మహిళలను అడిగితే మిషన్ భగీరథ గొప్పతనం తెలుస్తుందని కేటీఆర్ అన్నారు.
రాజకీయాల్లో ప్రతి గెలుపు ఓటములోనూ పాఠాలు ఉంటాయి. ఓటమి మనకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే. 100 రోజుల్లోగా హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. నిరుద్యోగ భృతిపై మాట మార్చారు. ఆరు హామీలే కాదు.. కాంగ్రెస్ 412 హామీలు ఇచ్చింది. సుపరిపాలన అందిస్తారా లేదా అనేది మీ ఇష్టం. రాష్ట్రం కోసం మేము దేనికైనా సిద్ధమని కేటీఆర్ అన్నారు.
Also Read: Mitchell Starc: ఐపీఎల్ పై మిచెల్ స్టార్క్ షాకింగ్ కామెంట్స్