Site icon HashtagU Telugu

KTR: ఇది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన

Ktr

Ktr

KTR: ఇది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘కోతల్లేని కరెంట్ ఇవ్వలేరు.. కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరు.. కోతులు పడి చనిపోయినా వాటర్ ట్యాంకులను పట్టించుకోరు. చివరికి.. నల్గొండలోని నీటిట్యాంకులో పదిరోజులుగా శవం ఉన్నా నిద్రలేవరు.
సాగర్ ఘటన స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే.. కాంగ్రెస్ సర్కారులో మళ్లీ అదే నిర్లక్ష్యం.. అదే నిర్లిప్తత’’ అని కేటీఆర్ మండిప‌డ్డారు.

‘‘సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కారిది. ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిన గలీజు పాలన ఇది. మిషన్ భగీరథ పథకంతో.. దశాబ్దాల తాగునీటి తండ్లాటను తీరిస్తే.. కనీసం నీటిట్యాంకుల నిర్వహణ కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వమిది. గుర్తుంచుకోండి. జలమే జగతికి మూలం. ఈ సర్కారు తీరు మారకపోతే.. జనమే కాంగ్రెస్ ను తరిమికొట్టడం ఖాయం’’ అని కేటఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఫైర్ అయ్యారు

Exit mobile version