Site icon HashtagU Telugu

Minister KTR: వరంగల్ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష..అధికారులకు కీలక ఆదేశాలు

Minister KTR

New Web Story Copy 2023 08 06t025918.366

Minister KTR: వరంగల్ నగరానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, జిల్లా ఎమ్మెల్యేలు, సహచర ఎమ్మెల్సీలతొ మరియు నగర మేయర్, ఇతర ఉన్నతాధికారులు సమీక్ష లో పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా మంత్రి కేటీఆర్ ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ పనుల పురోగతి వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. వరంగల్ నగరానికి ఇప్పుటికే ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇచ్చి నగర అభివృద్ధి కోసం మద్దతు అందిస్తుందని తెలిపారు. వీటికి అదనంగా టి యు ఎఫ్ ఐ డి సి ద్వారా మరో 250 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను వెంటనే విడుదల చేస్తామని ప్రకటించారు. 250 కోట్ల రూపాయల నిధులతో నగర ప్రజలకు తక్షణ ఉపశమనం లభించే అత్యంత కీలకమైన మౌలిక వసతులను కల్పించాలని కోరారు.

ఇటీవల భారీ వర్షాల కారణంగా వరంగల్ ప్రాంతం ప్రభావితమైంది. దీనిపైన కూడా కేటీఆర్ అధికారులతో చర్చించారు. భారీ వరదల నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి వరదలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపైన… దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాలని కేటీఆర్ ఆదేశించారు. వరద నివారణలో భాగంగా నాలాల అభివృద్ధి… నాలాల పైన ఉన్న అడ్డంకుల తొలగింపును వెంటనే చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. కబ్జాలకు గురైన నాళాలను గుర్తించాలని, వాటిని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టాలని… ఈ విషయంలో ఎలాంటి రాజకీయాలు ఒత్తిడిలకు తలగవద్దని అధికారులకు సూచించారు. కబ్జాల తొలగింపు విషయంలో పేద ప్రజలను ఒప్పించి, వేగంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు. భవిష్యత్తు వరదల్లో ప్రాణ నష్టం జరగకుండా ఉండడం కోసమే ఈ కార్యక్రమం తీసుకుంటున్నట్లు వారికి తెలియజేయాలని కోరారు.

వరంగల్ వరదలను అరికట్టేందుకు హైదరాబాదు నగరంలో ఏర్పాటుచేసిన ఎస్ ఎన్ డి పి కార్యక్రమం మాదిరి ఒక ప్రత్యేక కార్యచరణ తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్లో చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా గతంలో మాదిరే ఈసారి కూడా అదే స్థాయిలో వర్షం పడినా… హైదరాబాద్ ప్రజలకు వరదల నుంచి ఎంతో ఉపశమనం కలిగిందని… ఇలానే వరంగల్ నగరానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా ప్రజా ప్రతినిధులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ వెంటనే ఇలాంటి ఒక ప్రత్యేక నాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని పురపాలక శాఖ అధికారులకు సూచించారు. వరంగల్ నగరంలో సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న కాలోజీ ఆడిటోరియం వంటి అభివృద్ధి పనులలో జరుగుతున్న జాప్యం పైన మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. వీటిని వెంటనే పూర్తి చేసేందుకు అవసరమైతే ఎక్కువ సిబ్బందిని పెట్టి, అధిక షిఫ్టుల్లో పనిచేస్తూ ముందుకు వెళ్లాలని… ఈ కార్యక్రమాలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చూసుకుంటుందన్న భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్

Also Read: Krishna : బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఏర్పాటు.. హాజరైన కుటుంబ సభ్యులు..