KCR Insulted: సీఎం కేసీఆర్ ను అవమానించినట్లు కాదా..?మంత్రి కేటీఆర్..!!

ఫిబ్రవరిలో రామానుజాచార్యుల సమానత్వ విగ్రహం ప్రారంభోత్సవానికి తన తండ్రి కేసీఆర్ గైర్హాజరు కావడంతో వచ్చిన విమర్శలపై టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Publish Date - April 26, 2022 / 09:19 AM IST

ఫిబ్రవరిలో రామానుజాచార్యుల సమానత్వ విగ్రహం ప్రారంభోత్సవానికి తన తండ్రి కేసీఆర్ గైర్హాజరు కావడంతో వచ్చిన విమర్శలపై టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియాకు చెందిన ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలను వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాతామూర్తి విగ్రహం ప్రారంభోత్సవం కోసం హైదరాబాద్ కు వచ్చినప్పుడు…స్వాగతించడానికి, వ్యక్తిగతంగా ఆతిథ్యం ఇచ్చేందుకు కేసీఆర్ రాలేదని…ఇది ప్రోటోకాల్ ఉల్లంఘననే అవుతుందని చాలా మంది అన్నట్లు కేటీఆర్ తెలిపారు. అయితే గతేడాది నవంబర్ లో భారత్ బయోటెక్ కోవిడ్ వ్యాక్సిన్ సదుపాయాన్ని సందర్శించడానికి మోదీ వచ్చినప్పుడు కూడా సీఎం కేసీఆర్ కనిపించలేదు. దీనికి కారణం ఉంది. అదేంటంటే..ఈ రెండు సందర్భాల్లోనూ సీఎం కేసీఆర్ రావద్దంటూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి స్పష్టమైన సందేశం వచ్చిందని కేటీఆర్ చెప్పారు. ఇదంతా కూడా పీఎంఓ ప్రోటోకాల్ ఉల్లంఘనలు కాదా…ఓ ముఖ్యమంత్రిని ప్రధాని అవమానించడం కాదా అంటూ ప్రశ్నించారు.

గవర్నర్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ప్రోటోకాల్ ఎందుకు పాటించడంలేదని అడిగిన ప్రశ్నకు కేటీఆర్ స్పందించారు. గవర్నర్ బీజేపీ నేతలా ప్రవర్తిస్తున్నారు. ఆమె కౌన్సిల్ ఆమోదించమని గణతంత్ర దినోత్సవ ప్రసంగాన్నిచదివారు. మంత్రులపై రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ ప్రారంభంలో గవర్నర్ తమిళిసై మేడారం సమ్మక్క సారక్క జాతరకు హాజరై…అక్కడి నుంచి యాద్రాద్రిని సందర్శించారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ కు స్వాగతం పలికేందుకు మంత్రి కానీ, ఎమ్మెల్యేకానీ చివరకు అధికారులు సైతం రాలేదు. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తనను అవమానించారని..ఫిర్యాదు చేశారు. అంతేకాదు ముఖ్యమంత్రి తన ఆహ్వానాలను పలుమార్లు తిరస్కరించారని…ప్రోటోకాల్ ను ఉల్లంఘించారని ఆరోపించారు.

దీనిపై కూడా కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రులను ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు ఎందుకు అవమానిస్తున్నారని ప్రశ్నించారు. వరిధాన్యం వంటి సమస్యలను తాము లేవనెత్తినప్పుడు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఎగతాలి చేసి మాట్లాడారు. అభివ్రుద్ధిలో చక్కటి పనితీరును కనబరుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం అభివ్రుద్ధి పథంలో దూసుకుపోవడం చూసి ఓర్వలేకే తమను అగౌరవపరుస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.