Site icon HashtagU Telugu

Bandi Sanjay: తెలంగాణలో ఆర్కే బ్రదర్స్ పాలన.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్య‌లు

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: ఢిల్లీలో సెటిల్మెంట్ చేసుకోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కథ కంచికి పోయిందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్య‌లు చేశారు. తాజ‌గా సంగారెడ్డిలో ప‌ర్య‌టించిన కేంద్ర మంత్రి బండి.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఢిల్లీలో సెటిల్‌మెంట్ జ‌ర‌గడంతో కేటీఆర్ అరెస్ట్ కథ కంచికి చేరింద‌ని ఆరోపించారు. అలాగే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కాం కేసులన్నీ గాల్లో క‌లిసిపోయాయాని విమ‌ర్శించారు. కలెక్టర్ పై దాడి సూత్రధారి కేటీఆర్ అని తేలినా అరెస్ట్ చేయకపోవడం సిగ్గు చేటు అని ఆయ‌న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హించారు. కేటీఆర్ ను అరెస్ట్ చేయకపోవడం సర్కార్ చేతగానితనమే అని దుయ్య‌బ‌ట్టారు.

Also Read: Minister Sridhar Babu: బీజేపీపై మంత్రి శ్రీధర్ బాబు విమ‌ర్శ‌లు.. ఆ విష‌యంపై బీజేపీ స్పంద‌న కోరిన మినిస్ట‌ర్‌!

ఇంకా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్ పాలన నడుస్తోందన్నారు. కేసీఆర్, రేవంత్ కుటుంబానికి మధ్య వ్యాపార సంబంధాలున్నాయ‌ని తెలిపారు. వారి మ‌ధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయ‌ని నేను నిరూపిస్తా.. కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమా? అని స‌వాల్ విసిరారు. నాకు, రేవంత్ మధ్య వ్యాపార సంబంధాలున్నాయని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా? అని బ‌హిరంగా చెప్పేశారు. రైతుల సమస్యను పక్కదారి పట్టించేందుకే దాడులు తెరపైకి తెస్తున్నార‌ని ఆరోపించారు.

బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ అని, దాడులతో ప్రజల ప్రాణాలాతో చెలగాటాలాడుతోందని ఆరోప‌ణ‌లు చేశారు. గ్రూప్- 1, కానిస్టేబుల్ ఆందోళనలోనూ బీఆర్ఎస్ విధ్వంసం చేయాలనుకుందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను నిషేధించాలని కొత్త డిమాండ్ తెర‌పైకి తీసుకొచ్చారు. అలాగే రాష్ట్ర ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాల‌ని ఆయ‌న కోరారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప‌ద‌విపై కూడా ఆయ‌న స్పందించారు. తాను ప్ర‌స్తుతం కేంద్ర మంత్రిగా కొన‌సాగుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగించే అవకాశాల్లేవని స్ప‌ష్టం చేశారు.