KTR : మాకు ఇదో గుణపాఠం – ఫలితాల ఫై కేటీఆర్ రియాక్షన్

రాష్ట్రంలో త‌మ‌కు ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించాల‌ని ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చార‌ని దానిని స్వాగతిస్తున్నామని తెలిపారు

  • Written By:
  • Publish Date - December 3, 2023 / 06:42 PM IST

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 65 స్థానాల్లో ‘కాంగ్రెస్’ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ 39 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించారు. ఈ ఫలితాల ఫై బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ స్పందించారు.

ఈ ఫలితాలు మాకు ఓ గుణపాఠం అన్నారు. రాష్ట్రంలో త‌మ‌కు ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించాల‌ని ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చార‌ని దానిని స్వాగతిస్తున్నామని తెలిపారు. స‌మ‌ర్థ‌వంతంగా, బాధ్య‌త‌గా ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తామ‌ని స్పష్టం చేసారు. ఈ ఎదురుదెబ్బను గుణపాఠంగా తీసుకుని బీఆర్ఎస్ ఓటమికి కారణాలను విశ్లేషించకుంటామని తెలిపారు. మాకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా నిలదొక్కుకున్నాం.. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో కూడా ఇమిడి పోతామన్నారు. ఇది కారు స్పీడ్ కు బ్రేకర్ మాత్రమేనని.. మార్పులు చేసుకుని మళ్లీ ముందుకెళ్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ నిరాశపడొద్దని.. రాజకీయాల్లో గెలుపు ఓటములు సాధారణం అని ధైర్యం చెప్పారు.

గ‌త 100 రోజులుగా దాదాపు ఆగ‌స్టు 21న కేసీఆర్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌టించిన త‌ర్వాత నేటి వ‌ర‌కు కార్య‌క‌ర్త‌లు నాయ‌కులు అహ‌ర్నిశ‌లు, ఎన్నో ర‌కాలు ప్ర‌య‌త్నాలు చేసి శ్ర‌మించి గెలుపు కోసం చాలాచాలా క‌ష్ట‌ప‌డ్డారు. వారికి హృద‌య‌పూర్వ‌కంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. 60 ల‌క్ష‌ల మంది కార్య‌క‌ర్త‌లు ఎంతో క‌ష్ట‌ప‌డి శ్ర‌మించిన‌ప్ప‌టికీ ఆశించిన ఫ‌లితం రాలేదు. గ‌తం కంటే మంచి మెజార్టీ సాధిస్తామ‌నే ఆశాభావంతో ఎన్నిక‌ల‌కు వెళ్లాం. కానీ అనుకున్న ఫ‌లితం రాలేదు. ప‌దేండ్లుగా ప్ర‌భుత్వాన్ని ఎంత స‌మ‌ర్థ‌వంతంగా, విశ్వాసంగా సేవ‌లందించామో అదే ప‌ద్ధ‌తుల్లో ఈ కొత్త ప్రాత కూడా నిర్వర్తిస్తాం అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్ర‌జ‌ల ద‌యతో రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చాం. ఈ ప‌దేండ్లు చేసిన ప‌ని ప‌ట్ల సంతృప్తి ఉంది. ఇవాళ ఫ‌లితాలు కొంత నిరాశ ప‌రిచినా బాధ, అసంతృప్తి లేదు. రాజ‌కీయాల్లో ఇవ‌న్నీ స‌హ‌జం. మ‌నం అంద‌రం కూడా కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ మ‌న్న‌న పొంద‌డానికి విశేష‌మైన కృషి చేశారు. ఈ సంద‌ర్భంగా శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నా. కార్య‌క‌ర్త‌ల పోరాట ఫ‌లితం కార‌ణంగానే ఇంత దూరం వ‌చ్చాం అని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. వారికి కూడా మా అభినంద‌న‌లు, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ప్ర‌భుత్వాన్ని న‌డ‌పాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను. మా పార్టీ త‌ర‌పున కూడా కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్ష‌లు. నిర్మాణ‌త్మ‌కంగా ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం ముందుకు పోతాం. కొత్త ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేయం. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకుంటార‌ని ఆశిస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వాన్ని వెంటనే ఇబ్బంది పెట్టమని.. వాళ్లు కూడా కుదురుకోవాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల్లో చాలామంది స్వల్ప ఓట్లతో తేడాతోనే ఓడిపోయారన్నారు. ప్రజా తీర్పును గౌరవించి ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారని తెలిపారు.

Read Also : Telangana Elections results : కాంగ్రెస్ విజయం ఫై హరీష్ , కవిత ల స్పందన