Site icon HashtagU Telugu

Ram charan and KTR: కేటీఆర్, రామ్ చరణ్ ప్రత్యేక భేటీ!

ktr and ram charan

Whatsapp Image 2023 02 10 At 7.47.50 Am

మంత్రి కేటీఆర్ తో తెలుగు సినీ హీరోలకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వివిధ కార్యక్రమాల సందర్భంగా ఆయన్ను కలిసేందుకు హీరోలు ఉత్సాహం చూపిస్తుంటారు. తాజాగా మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కర్మాగారం కోసం మంత్రి కేటీఆర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం అనంతరం మహీంద్రా సంస్థ తయారు చేసిన XUV-400 ఫార్ములా ఎడిషన్ జనరేషన్-3 రేసింగ్ కారుని ఆవిష్కరించారు. ఈ కారు ఆవిష్కరణ కోసం హీరో రామ్ చరణ్ కూడా వచ్చారు. కేటీఆర్, రామ్ చరణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

మహీంద్రా రేసింగ్ కార్ ప్రారంభోత్సవ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని ట్విట్టర్లో పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. ఆనంద్ మహీంద్రా, సీపీ గుర్నాని, రామ్ చరణ్ ని కలవడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చిన సందర్భంగా రామ్ చరణ్ కి శుభాకాంక్షలు తెలిపినట్టు చెప్పారు కేటీఆర్.