Site icon HashtagU Telugu

KTR : ఇచ్చిన హామీలు ఏంటి..? చేసే పని ఏంటి..? రేవంత్ ఫై కేటీఆర్ ప్రశ్నల వర్షం

KTR Fire

KTR Fire

గత పది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న బుల్డోజర్‌ వ్యవస్థ (Hydraa) ఫై కేటీఆర్ (KTR) నిప్పులు చెరిగారు. అసలు కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) ఏమిచెప్పి అధికారంలోకి వచ్చింది..? అధికారంలోకి వచ్చాక ఏంచేస్తుంది..? ఇదేనా మార్పు అంటే..? ఓటు వేసి గెలిపించిన పాపానికి వారిని రోడ్డున పడేస్తారా..? అంటూ కేటీఆర్ వరుస ప్రశ్నలు సంధించారు. రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కేటీఆర్..ఈరోజు ఆ జ్వరం మీదనే హైడ్రా బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి జరిగిన తీరు ఫై ఆవేదన వ్యక్తం చేసారు. బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ సర్కార్ తీరు ఫై నిప్పులు చెరిగారు.

‘పై రోజులుగా హైదరాబాద్‌ తో పాటు రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో సూర్యాపేట, ఆదిలాబాద్‌, సంగారెడ్డి ఇతర కొన్ని పట్టణాల్లో చాలాచోట్ల ప్రభుత్వం దుందుడుకు వైఖరి వల్ల చాలామంది పేదలు నిరాశ్రయులయ్యారు. ఎన్నో ఆశలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైన అన్యాయం మళ్లొకసారి కాంగ్రెస్‌ పార్టీ చేస్తది మేం ఊహించలేదు. ఏ ఇందిరమ్మ చెప్పింది? యే సోనియమ్మ చెప్పింది పేదలకొంపలు కూల్చి పెద్దలకు లాభం చేయమని రేవంత్‌రెడ్డికి ఈరోజు తెలంగాణలోని పేద తల్లులందరూ మా నాయకత్వం వద్దకు వచ్చి మొరపెట్టుకుంటున్నారు’ అని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల్లో ఎన్నో హామీలు ప్రకటించి..ఈరోజు ఆ హామీలు అమలు చేయకుండా ఓట్లు వేసిన ప్రజల గూడు లేకుండా చేస్తున్నారు.

అధికారంలోకి వచ్చి 300 రోజులు దాటింది. వందరోజుల్లో చేస్తామని చెప్పిన ఒకమాట చేయకపోగా..300 రోజులు దాటినా ఎప్పుడు చేస్తారో స్పష్టత ఇవ్వకుండా..ఈరోజు అక్కరలేని.. ప్రజలు కోరుకోని.. కాస్మోటిక్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ కోసం రూ.1.50లక్షలకోట్లు ఖర్చుపెడుతామంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి.. ఎవరైనా మున్సిపల్‌ శాఖ చూస్తున్నారో ఆయనను సూటిగా అడుగుతున్నా. మీరు ఏం ఆశించి చేస్తున్నారు ఈ ప్రాజెక్టు అని కేటీఆర్ డిమాండ్ చేసారు.

ఖజానాలో డబ్బులే లేవు.. లంకెబిందెలు లేవని సీన్ చెపుతాడు. అప్పులు కట్టేందుకే అప్పులు చేయాల్సి వస్తుందని ఉప ముఖ్యమంత్రి చెబుతున్నడు. ఇంత వరకు కనీసం ఇచ్చిన హామీ సవ్యంగా నెరవేర్చలేదు. రుణమాఫీ అన్నారు.. దేవుళ్లపై ఒట్లు పెట్టారు. పంద్రాగస్టు అన్నారు.. డిసెంబర్‌ అన్నారు అది పూర్తి చేయలేదు. ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు. 420 హామీలు ఉన్నాయ్‌. ఇప్పటి వరకు ఒక్కటి అమలు చేసిన పాపాన పోలేదు. ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు’ అంటూ కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

ఇక ఈరోజు హైడ్రా తీరుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఫై రాష్ట్రంలోని పేదల తరఫున హృదయపూర్వకంగా తెలంగాణ హైకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. మా లీగల్‌ సెల్‌ సైతం పేదలకు అండగా నిలబడింది. లంచ్‌ మోషన్స్‌ సైతం మూవ్‌ చేశారు. వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

Read Also : రైతన్నలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది – బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్

Exit mobile version