Site icon HashtagU Telugu

KTR: పేదింటి బిడ్డలకు కేటీఆర్ సాయం

Ktr

Ktr

ఇద్దరు మెరికల్లాంటి పేదింటి బిడ్డలకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. అందులో ఒకరు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ సీటు సాధించగా, మరొకరు నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలోని తుమ్మల పెన్‌పహాడ్ గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడు పిడమర్తి ప్రసాద్ కుమారుడు అనిల్ కుమార్‌కు ఐఐటి ఖరగ్‌పూర్‌లో అప్లైడ్ జియాలజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు కొనసాగించడం కష్టమవుతున్నదన్న విషయం సోషల్ మీడియా ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి రాగా విద్యకు కావలసిన ఆర్థిక సాయం అందించారు.

మహబూబ్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ గోపాల్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి సూర్యాపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు పొందాడు. కానీ ఖర్చులకు డబ్బులు లేక సాయం కోరుతూ మంత్రి కేటీఆర్ గారికి గత నెలలో ట్వీట్ చేశాడు. స్పందించిన మంత్రి కేటీఆర్ నేడు ప్రశాంత్ రెడ్డిని తన కార్యాలయంలో కలిసి తన చదువు ఖర్చులకు అవసరమైన ఆర్థిక సాయం అందించారు.

 

Exit mobile version