Site icon HashtagU Telugu

KTR Press Meet : నాకేమైనా ఉరిశిక్ష పడిందా..ఏంటి ఆ శున‌కానందం.? – KTR

Ktrpm

Ktrpm

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు (High Court BIG Shock to KTR) హైకోర్టు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ (Quash Petition)ను (Telangana High Court) కొట్టి వేసింది. ఏసీబీ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. అలాగే కేసును విచారించేందుకు ఏసీబీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే క్రమంలో కేటీఆర్‌పై ఉన్న అరెస్టు స్టేను కూడా ఎత్తివేయాలని తీర్పులో పేర్కొన్నారు. దీంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం..క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత తదితర విషయాలపై కేటీఆర్ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

Finnish Woman : ఫిన్లాండ్‌ అమ్మాయి తెలుగులో ఎంత బాగా మాట్లాడుతోందో!

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. చట్టాన్ని గౌరవించాలనే ఉద్దేశంతోనే నిన్న తాను ఏసీబీ విచారణకు హాజరయ్యానని స్పష్టం చేసారు. ఇది కక్ష సాధింపు కేసు అని తెలిసి కూడా వెళ్లానన్నారు. తన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో ఏదో ఉరిశిక్ష పడినట్లు కాంగ్రెస్ నేతలు ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. కొందరు మంత్రులైతే న్యాయమూర్తిల్లా ఫీలవుతున్నారని సెటైర్లు వేశారు. న్యాయపరంగా ఈ అంశంపై పోరాటం చేస్తానని, లాయర్లతో విచారణకు వెళ్తానని కేటీఆర్ స్పష్టం చేశారు.

తనపై పెట్టిన కేసు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు కోణంలో ఉందని , ఇది అక్రమంగా నమోదు చేసిన కేసు తప్ప మరోటి లేదు. ఏమీ లేకున్నా దీనిని ఒక పెద్ద కధలా చాటడం కాంగ్రెస్ నేతల పద్ధతి. పొద్దుట్నుంచి కాంగ్రెస్ నాయ‌కుల హ‌డావుడి చేస్తున్నారు. భార‌త పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌర‌వించే పౌరుడిగా ఇది అక్ర‌మ కేసు అని చెబుతున్నాను. పొలిటిక‌ల్లి మోటీవేటేడ్‌ కేసు అందులో ఏమీ లేని లోట్ట‌పీసు కేసు.. బ‌ట్ట‌కాల్చి మీద వేసి ఏదో జ‌రిగింద‌ని చూపేట్టే క‌క్ష సాధింపు కేసులు అని తెలిసీ కూడా ఏసీబీ విచార‌ణ‌కు వెళ్లాను. ఈ కేసు పెట్టి, క‌థ‌లు అల్లి శునకానందం పొందుతున్న చిట్టి నాయుడికి ఒక మాట చెప్పాల్సి ఉంది. చ‌ట్టాన్ని గౌర‌వించే పౌరుడిగా.. నువ్వు అక్ర‌మ కేసులు పెడితే.. బుర‌ద జ‌ల్లితే న్యాయ‌ప‌రంగా, రాజ్యంగా ప‌రంగా ప్ర‌తి హ‌క్కును వినియోగించుకుంటాను అని పేర్కొన్నారు.

ఏసీబీ కేసుపై హైకోర్టులో పిటిష‌న్ వేశాను.. త‌ప్పు ఎఫ్ఐఆర్.. ఇష్ట‌మొచ్చిన‌ట్లు సెక్ష‌న్లు పెట్టార‌ని వాదించాం. కానీ హైకోర్టు క్వాష్ పిటిష‌న్‌ను కొట్టేసింది. దీంతో నాకు ఉరి శిక్ష వేశారు.. నేరారోప‌ణ రుజువైంద‌ని అని సంక‌లు గుద్దుకుంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. ఇది ప్రారంభ‌మే.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిన్ వేశాం. అది కూడా విచార‌ణ‌కు వ‌స్తది అక్క‌డ న్యాయ పోరాటం చేస్తాను అని కేటీఆర్ స్పష్టం చేసారు.