Site icon HashtagU Telugu

KTR Praises Chandrababu: చంద్రబాబు ఫై కేటీఆర్ ప్రశంసలు..

Ktr Praises Chandrababu

Ktr Praises Chandrababu

చంద్రబాబు ఫై బిఆర్ఎస్ (BRS) మంత్రి కేటీఆర్ (KTR) ప్రశంసలు కురిపించి వార్తల్లో నిలిచారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Polls) పోలింగ్ కు 16 రోజులు మాత్రమే ఉండడం తో అన్ని రాజకీయ పార్టీ లు తమ ప్రచారం తో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..ఏ ఫ్లాట్ ఫామ్ ను వదిలిపెట్టకుండా ప్రచారం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఓ పక్క సభలు , సమావేశాల్లో పాల్గొంటూనే, మరోపక్క సోషల్ మీడియా లో , వివిధ న్యూస్ చానెల్స్ లలో ఇంటర్వూస్ ఇస్తూ వస్తున్నాడు.

నేడు మంగళవారం (నవంబర్ 14) హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో జరిగిన తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ సమావేశంలో (Builders Federation meeting) కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత 25 ఏళ్లు వెనక్కి వెళ్లి చూస్తే ముగ్గురు ముఖ్యమంత్రులే గుర్తుకు వస్తారని చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ ఈముగ్గురు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను , తెలంగాణ ను ఎంతగానో అభివృద్ధి చేసారని చెప్పుకొచ్చారు. గత పాతికేళ్లలో వీరే ప్రధానంగా సుదీర్ఘ కాలం సీఎంలుగా ఉండి రాష్ట్రం మీద, హైదరాబాద్ నగరంపైనా తమదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. వీరిలో చంద్రబాబు ప్రొ బిజినెస్, ప్రొ ఐటీ, ప్రొ అర్బన్ మోడల్ గా ఉండేదని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి హాయాంలో ప్రొ రూరల్, ప్రొ అగ్రికల్చర్, ప్రొ పూర్ (పేదల పక్షపాతి) అని చెప్పారు. కేసీఆర్ విషయంలో రెండూ కలిపిన మోడల్ అని చెప్పుకొచ్చారు.

అలాగే మరో ఛానల్ ఇంటర్వ్యూ లో కేటీఆర్ మాట్లాడుతూ..‘‘చంద్రబాబుకు మోడీ కంటే చిన్న వయస్సు. చంద్రబాబుకు మరో పది పదిహేనేళ్లు రాజకీయం చేసే సత్తా ఉంది. శాంతిభద్రతల నేపథ్యంలోనే ఆందోళనల విషయంలో.. అది పక్క రాష్ట్రం వ్యవహారం అన్నా. చంద్రబాబు అరెస్ట్ విషయంలో నా వ్యాఖ్యలు తప్పుగా జనంలోకి వెళ్లాయి. చంద్రబాబు, లోకేశ్‌, జగన్‌, పవన్‌కల్యాణ్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటా.చంద్రబాబు విషయంలో లోకేశ్‌ ఆవేదనను అర్థం చేసుకున్నా. చంద్రబాబు, లోకేశ్‌ విషయంలో మాకు సోదరభావం ఉంది’’ అని కేటీఆర్‌ తెలిపారు.

Read Also : BRS Minister: నరేందర్ రెడ్డి గెలుపు రెండోసారి ఖాయం: మహేందర్ రెడ్డి