KTR Birthday: పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ కీలక నిర్ణయం

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ రోజు జూలై 24న 47వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

KTR Birthday: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ రోజు జూలై 24న 47వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రొటీన్ గా కేక్ కట్ చేయడమో, కార్యకర్తలతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడమో కాకుండా ఈ ఏడాది వినుత్న కార్యక్రమాలకు తెరలేపారు. తన పుట్టినరోజు సందర్భంగా పేద పిల్లలకు సహాయం చేయాలనీ నిశ్చయించుకున్నాడు. 10, 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్ టాప్, రెండు సంవత్సరాల కోచింగ్ ఇప్పించనున్నట్టు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో యూసుఫ్‌గూడ‌లో ఉన్న స్టేట్ హోంలోని అనాథ పిల్ల‌ల‌కు త‌న వంతు సాయం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు 10, 12వ త‌ర‌గ‌తుల్లో ప్ర‌తిభావంతులైన 47 మంది పిల్ల‌ల‌కు, ప్రొఫెష‌న‌ల్ కోర్సుల నుంచి మ‌రో 47 మంది పిల్ల‌ల‌కు వ్య‌క్తిగ‌తంగా అండ‌గా ఉంటాన‌ని తెలిపారు. ఈ విద్యార్థులంద‌రికీ ఉచితంగా ల్యాప్ టాప్‌లు అందిస్తాన‌ని శపధం చేశారు. రెండేండ్ల పాటు కోచింగ్ ఇప్పిస్తాన‌ని పేర్కొన్నారు. కేటీఆర్ తీసుకున్న నిర్ణయానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్స్ లీడర్ అంటూ ప్రశంసిస్తున్నారు.

Also Read: Ram Charan : చరణ్ ఫస్ట్ రెమ్యూనరేషన్‌ ఎంత ? దాంతో ఏం కొన్నాడో తెలుసా..?