Site icon HashtagU Telugu

KTR : ఏదో చేద్దామనుకుంటే.. మరేదో అయింది.. ప్లాన్ రివర్స్

Ktr Plan Revarce

Ktr Plan Revarce

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ (Congress Vs BRS) మధ్య పొలిటికల్ వార్ నడుస్తుంది. ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు సోషల్ మీడియాను ఓ బలమైన అస్త్రంగా వాడుకుంటున్న కేటీఆర్ (KTR)..తాజాగా ప్రభుత్వ్హాన్ని ఇరకాటంలో పడేద్దామనుకొని..తానే ఇరకాటంలో పడిపోయాడు. తాజాగా ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల సమస్యను ప్రస్తావిస్తూ చేసిన ఓ పోస్టు కేటీఆర్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. ఖమ్మం జిల్లా నామవరం గ్రామానికి చెందిన రైతు చింతిర్యాల కోటేశ్వరరావు మిర్చి మార్కెట్ యార్డులో ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియోను కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

Kim Jong Un : అలా చేస్తే ఊరుకోం.. అమెరికాకు కిమ్‌ వార్నింగ్‌..

రైతు గోసను ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సర్కార్‌ను తీవ్రంగా విమర్శించారు. అయితే, కొద్ది సమయానికే ఆ వీడియో పాతదని, 2018లో కేసీఆర్ హయాంలోనిది అని తేలింది. ఈ విషయాన్ని గ్రహించిన కేటీఆర్ వెంటనే తన పోస్టును డిలీట్ చేశారు. అయితే అప్పటికే ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో కాంగ్రెస్ వర్గాలు దీనిపై ఘాటుగా స్పందించాయి. తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేసి చేయాలనీ చూస్తే..అదే రివర్స్ అవుతుందంటూ..దీనికి ఉదాహరణ ఇదే అంటూ కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ కౌంటర్లకు కేటీఆర్ వద్ద సమాదానాలు లేకుండా పోయాయి. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని చూస్తే..రివర్స్ లో కేటీఆరే ఇరకాటంలో పడ్డాడు.