తెలంగాణ ఎన్నికల ప్రచారం (Telangana Election Campaign)లో అన్ని పార్టీలు దూకుడు మీద ఉన్నాయి. ఎవరికీ వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అయితే అధికార పార్టీ లోని కీలక నేతలకు ఈసారి ఓటమి తప్పదనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అందులో కేటీఆర్ (KTR) కూడా ఉన్నట్లు ప్రచారం అవుతుంది. సిరిసిల్ల లో ఈసారి కేటీఆర్ గెలుపు కష్టమే అని..అక్కడ కూడా కాంగ్రెస్ గాలి గట్టిగా విస్తున్నదని పలు సర్వేలు తెలుపుతున్నాయి. ఇదే క్రమంలో కేటీఆర్ ఫోన్ కాల్ (KTR Phone Call) ఇప్పుడు సోషల్ మీడియా లో మరింత వైరల్ గా మారింది.
ఫోన్ కాల్ లో ఏమాట్లాడారనేది చూస్తే..
‘మనకు ఇంకా వారం రోజులే సమయముంది. అందరూ ప్రతిగ్రామంలోనూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలి. గాలి మాటలను నమ్మకండి. నేను ఎవరితోని మాట్లాడినా.. పక్క ఊళ్లో పరిస్థితి తేడాగా ఉందన్నా..జర చూస్కో అని చెబుతున్నారు. మెజార్టీ తగ్గుందని మనోళ్లే ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పిచ్చిమాటలు బంద్ చేయండి. మహేందర్ రెడ్డి అక్కడ తిరుగుతున్నారు? ఆ కులపోళ్లు మనకు ఓటు వేయరంట అని వినిపిస్తున్నాయి. ఇవి మనోళ్లే మాట్లాడి..మనోళ్ల ప్రమోట్ చేస్తున్నారు. ఇలాంటివి ఆపండి. ఎక్కడిక్కడ పటిష్టం చేయాలి. సిరిసిల్లలో నేను ఓడిపోతానని వార్తలు రాస్తున్నారు. ఆ స్థాయికి రాసే కాడికిపోయిందంటే..మనం మాట్లాడే మాటల వల్లే..! గతంలో మాదిరి కాకుండా.. వచ్చే టర్మ్‌లో ప్రతి వారం రెండు రోజులు సిరిసిల్లలోనే ఉంటా. కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పండి. మీకేమైనా సమస్యలుంటే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పండి. ఎక్కడైనా ప్రజలు లొల్లి పెడితే కస్సుబుస్సు అనొద్దు. అందరూ నిమగ్నమై పనిచేయాలి. ’’ అని మంత్రి కేటీఆర్ అన్నట్లుగా ఆ ఆడియోలో ఉంది.
ప్రస్తుతం ఈ ఆడియో ను కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తూ..కేటీఆర్ కు భయం పట్టుకుందన్నట్లు ప్రచారం చేస్తూ వస్తున్నారు. మరి ఈ ఆడియో ఫై కేటీఆర్ ఏమైనా రియాక్ట్ అవుతారేమో అనేది చూడాలి.
Read Also : We’re now on WhatsApp. Click to Join.