బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR)..కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ ‘లుచ్చాగాళ్ల’ అంటూ ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన సభ (Farmers’ Protest)లో నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో నిర్వహించిన రైతు పోరుబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో, ఆదిలాబాద్ ప్రజలకు మహారాష్ట్రలో ఉన్న వారి బంధువులకు, స్నేహితులకు కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని తెలియజేయాలని సూచించారు.
కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను “లుచ్చగాళ్లు” అంటూ అభివర్ణిస్తూ, 2023 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలతో మోసం చేసిందని, అదే పరిస్థితి మహారాష్ట్రలో కూడా జరగకుండా వారిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. “రైతు భరోసా, తులం బంగారం, పెన్షన్లు, స్కూటీలు” వంటి హామీలను కాంగ్రెస్ తమ స్వార్థం కోసం వాడుకుందని, ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ పోరాటం ఇక్కడితో ఆగదని, ఆదిలాబాద్ ముందునుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తు చేశారు. మహారాష్ట్రలో ఉన్న బంధువులకు, స్నేహితులకు కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని తెలియజేసి, వారికి ఓటు వేయకుండా చూడాలని పిలుపునిచ్చారు. రైతులపై పెట్టిన అక్రమ కేసుల గురించి చర్చిస్తూ, రుయ్యాడ గ్రామంలో రైతుల నిరసనలపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. రుణమాఫీ మోసం వల్ల నష్టపోయిన రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడుతుందని, అవసరమైతే తామే జైలు వెళ్లి రైతులకు మద్దతు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Read Also : Amaravati : అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం