Site icon HashtagU Telugu

KTR Reacts: కేటీఆర్ సీరియస్ ,బొల్లంపల్లి కమిషనర్ సస్పెండ్

Ktr

Ktr

మంత్రి కేటీఆర్ బర్త్ డే ఫంక్షన్ కు రాలేదని నలుగురు ఉద్యోగులకు నోటీస్లు ఇచ్చిన బొల్లం పల్లి మున్సిపల్ కమిషనర్ గంగాధర్ ను సస్పెండ్ చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ కు కేటీఆర్ సిఫార్సు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఉద్యోగులకు నోటీస్ లు ఇచ్చిన విషయం వైరల్ అయింది.

ఈ సంఘటనపై హష్టాగ్ యు ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది. దాన్ని చదివిన మంత్రి కేటీఆర్ ప్రాధమిక విచారణకు ఆదేశించారు. ‘బర్త్ డే బాష్’ ఫంక్షన్ కు రాలేదని ఉద్యోగులపై సస్పెండ్ వేటువేసిన గంగాధర్ వాలకాన్ని మంత్రి సీరియస్ గా తీసుకున్నారు. సైకో ఫాన్స్ గా ఆయన్ను వర్ణిస్తూ బెల్లం పల్లి మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు ఆదేశించారు.

Also Read: 4 Telangana employees suspended

హైదరాబాద్ నుంచి రంగంలోకి దిగిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులు బొల్లంపల్లి బర్త్ డే బాస్ ఫంక్షన్ వివాదానికి తెరవేయనుంది. కమిసినర్ గంగాధర్ ను సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధం అయింది. అలాగే ఉద్యోగులపై తీసుకున్న చర్యలను వెనక్కు తీసుకున్నారు. మొత్తం మీద ట్విట్టర్ వేదికగా కేటీఆర్ సీరియస్ కావటంతో రెండు రోజులుగా నడుస్తున్న ఈ ఇష్యూ కి తెరపడింది.

 

Exit mobile version