Site icon HashtagU Telugu

KTR Fire: ఈ ముఖ్య‌మంత్రికి బతుకమ్మ అంటే గిట్టదా.. పట్టదా?: కేటీఆర్‌

KTR Fire

KTR Fire

KTR Fire: బతుకమ్మ పండుగ వేళ గ్రామాల్లో చెరువు వద్ద లైట్లు పెట్టడానికి, పరిశుభ్రత కోసం బ్లీచింగ్ పౌడర్ కొనడానికి డబ్బుల్లేని పరిస్థితులు దాపురించాయని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR Fire) అన్నారు. ‘బతుకమ్మ అంటే గిట్టదా, పట్టదా ఈ ముఖ్యమంత్రికి? ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసు రావట్లేదా? బతుకమ్మ చీరలను రద్దు చేశారు. ఇప్పుడు ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా?’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

ఈ క్ర‌మంలోనే కేటీఆర్ త‌న ఎక్స్ ఖాతా ద్వారా కేటీఆర్‌కు ఈ మేర‌కు ప్ర‌శ్న‌లు సంధించారు. “బతుకమ్మ అంటే గిట్టదా..పట్టదా ఈ ముఖ్యమంత్రికి? ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసురాట్లేదా? పండుగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా వుంచలేరా? చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన అక్కా చెల్లెళ్లు బతుకమ్మ ఆడుకోవాల్నా? బ్లీచింగ్ పౌడర్ కొనడానికి..చెరువు కట్టమీద లైట్లు పెట్టడానికి పైసల్లేని పరిస్థితులు దాపురించాయి పంచాయతీల్లో! రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చింది..? తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం..? ప్రకృతిని పూజించే విశిష్ట పండుగను.. స్వచ్ఛమైన పరిసరాల్లో జరుపుకునే భాగ్యం కూడా లేదా మహిళలకు? బతుకమ్మ చీరెలను రద్దు చేసారు..ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా..?” అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

Also Read: Alka Lamba : 20 రోజుల్లో కాంగ్రెస్‌లో చేరిన 2 లక్షల మంది మహిళలు

నేడు నానేబియ్యం బ‌తుక‌మ్మ‌

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. రంగు రంగు పూల‌తో అంద‌రంగా బ‌తుక‌మ్మ‌ల‌ను పేర్చి గౌర‌మ్మ‌ను ఏర్పాటు చేసి సంప్ర‌దాయంగా పూజ‌లు చేస్తారు. ప్ర‌తి రోజు సాయంత్రం ఆరు గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు తెలంగాణ ఆడ‌ప‌డుచులు అంద‌రూ ఒక చోట చేరి పాట‌లు పాడుతూ బ‌తుక‌మ్మ‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. అయితే నాలుగో రోజు బతుక‌మ్మను నానేబియ్యం బతుకమ్మ’గా పిలుస్తారు. గౌరమ్మను తయారు చేసి, గుమ్మడి తంగేడు, బంతి, గునుగు లాంటి రకరకాల పూలతో అలంకరిస్తారు. గౌరమ్మకు నైవేద్యంగా నానబెట్టిన బియ్యాన్ని బెల్లం లేదా చెక్కరతో కలిపి ముద్దలు చేసి పెడతారు.