Site icon HashtagU Telugu

Kadana Bheri : కరీంనగర్ సభకు కేటీఆర్ దూరం..కారణం అదే..!!

Criminal Case Against KTR

Ktr (1)

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS).. లోక్ సభ (Lok Sabha) ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి సత్తా చాటాలని సుహుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ (Kadana Bheri Public Meeting) పేరిట భారీ సభ నిర్వ్హరిస్తుంది. ఈ సభకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR) హాజరుకానున్నారు. కేసీఆర్‌ కు కరీంనగర్‌ (Karimnagar )ను సెంటిమెంట్‌గా భావిస్తారనే విషయం తెలిసిందే. 2001లో ఎక్కడైతే తెలంగాణ ఉద్యమ బావుటాను ఎగురవేశారో ఇప్పుడు అక్కడి నుంచే పార్లమెంట్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. కలిసొచ్చిన ఎస్సారార్‌ కళాశాల మైదానం వేదికగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు కదనభేరి సభ ప్రారంభం కాబోతుంది.

We’re now on WhatsApp. Click to Join.

అధినేత కేసీఆర్‌ సహా పార్టీ అగ్రనాయకత్వం హాజరవుతుండగా, కళాశాల మైదానంలో సభా వేదికతోపాటు సభికుల కోసం బిఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసారు. పార్టీకి పూర్వ వైభవం తేవడంతో పాటూ.. కార్యకర్తల్లో ఈ సభ తో జోష్ నింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. కరీంనగర్‌, చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ, హుజూరాబాద్‌, మానకొండూర్‌, హుస్నాబాద్‌ నియోజకవర్గాల నుంచి భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. ఇంత భారీగా జరగనున్న ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ దూరంగా ఉంటున్నారు. దీనికి కారణంగా గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం తో బాధపడుతుండడమే. దీంతో ఆయన ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. . దీంతో ఇవాళ జరగనున్న కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు కేటీఆర్ తెలిపారు.

మూడు రోజుల కింద కామారెడ్డిలో జరిగిన సమావేశం అనంతరం జ్వరం భారినపడ్డారు కేటీఆర్. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు హాజరు కాలేకపోతున్నారు.

Read Also : TSRTC : ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ కీలక నిర్ణయం..!