Car Race Issue : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నగరంలో నిర్వహించిన ఈ కార్ రెస్ వ్యవహారంలో కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. కేటీఆర్ చేసింది. పెద్ద తప్పుఅని, దానికి ఆయన శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేశారు. కారు రేసింగ్ కేసులో అంతర్జాతీయ చట్టాల ప్రకారం కేటీఆర్ కు బెయిల్ కూడా వచ్చే అవకాశాలు లేవని అన్నారు. ఆయన ఏడేళ్లు జైల్లో ఉండాల్సి వస్తుందని అన్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ కు బెయిల్ రావాలని మొక్కుతున్నారని చెప్పారు.
ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి రావడంపై మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శబరిమలకు వెళ్లడానికి నల్ల దుస్తులు ధరించినట్టుందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ అరెస్ట్ అయితే ఆయనకు బెయిల్ రావాలని శబరిమలకు వెళ్లి మొక్కుతారని అన్నారు. మరోవైపు కేటీఆర్ పై విచారణకు రాష్ట్ర గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా, ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహరంలో అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ పై విమర్శలు వచ్చాయి. 2023లో హుస్సెన్ సాగర్ తీరాన నిర్వహించిన ఈ రేసింగ్ కు సంబంధించి విదేశీ సంస్థకు 55 కోట్ల చెల్లించారన్నది ప్రధాన ఆరోపణ. ఇందులో కేటీఆర్ పాత్ర ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. క్యాబినెట్ అనుమతి లేకుండానే ఈ మొత్తం విదేశీ సంస్థకు అప్పనంగా చెల్లించారని కాంగ్రెస్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: Allu Arjun : అల్లు అర్జున్ ను నిలదీసిన POW సంధ్య