TG : రేవంత్ రెడ్డి నీకు నిజంగా దమ్ముంటే ముందుకురా..కేటీఆర్ సవాల్

  • Written By:
  • Publish Date - May 8, 2024 / 03:41 PM IST

లోక్ సభ (Lok Sabha) ఎన్నికల పర్వంలో కాంగ్రెస్ – బిఆర్ఎస్ పార్టీల మధ్య సవాళ్లు , ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సవాళ్లు విసురుకోగా..తాజాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR)..సీఎం రేవంత్ (CM Revanth Reddy) నీకు నిజంగా దమ్ముంటే నువ్వు ముందుకురా.. నువ్వు పెట్టిన సర్క్యులర్, క్రిశాంక్ (Krishank Manne) పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెట్టి, ఏది ఒరిజినల్.. ఏది ఫోర్జ‌రి.. ఏది డూప్లికేట్ అనేది తేలుద్దాం అని కేటీఆర్ స‌వాల్ చేశారు.

బుధువారం బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ మ‌న్నె క్రిశాంక్‌తో కేటీఆర్ చంచ‌ల్‌గూడ జైల్లో ములాఖ‌త్ అయ్యారు. మ‌న్నె క్రిశాంక్‌ను కలిసిన అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నిజానిజాలు తేల్చిన తర్వాత ఎవరు చంచల్ గూడ జైలులో కూర్చోవాలో కూడా తేలుద్దామన్నారు. క్రిశాంక్ పోస్టు చేసిన స‌ర్క్యుల‌ర్ త‌ప్పు కాదన్నారు. చేయ‌ని త‌ప్పుకు క్రిశాంక్‌ను జైల్లో వేశారు. రేవంత్ స‌ర్కార్ చేసిన వెధ‌వ ప‌నికి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. క్రిశాంక్‌పై ఉద్దేశ‌పూర్వ‌కంగా కేసులు పెట్టి.. రేవంత్ రెడ్డి చిల్ల‌ర రాజ‌కీయం చేస్తున్నార‌ని కేటీఆర్ మండిప‌డ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

కేటీఆర్​తో పాటు క్రిశాంక్​ను అతడి భార్య సుహాసిని కూడా జైల్లో కలిసి పరామర్శించారు. అనంతరం ఆమె కూడా మీడియాతో మాట్లాడారు. తన భర్తపై తప్పుడు కేసు పెట్టారని క్రిశాంక్‌ భార్య సుహాసిని ఆరోపించారు. ఇలాంటి కేసులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఫేక్ సర్క్యులర్‌ను సర్క్యులేట్ చేసిన కేసులో బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు మేరకు అతడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ల 466, 468, 469, 505(1) కింద క్రిశాంక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓయూ పేరుతో ఫేక్‌ సర్క్యులర్‌ను సోషల్‌ మీడియాలో క్రిశాంక్‌ అప్‌లోడ్‌ చేశారని ఫిర్యాదు చేసింది కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగం.

గత ఏడాది ఓయూ వేసవి సెలవులకు సంబంధించి.. ఫేక్ ​సర్క్యూలర్​ను సోషల్​ మీడియాలో బీఆర్‌ఎస్‌ పోస్ట్‌ చేసిందన్నారు ఓయూ చీఫ్‌ వార్డెన్‌. ఫేక్‌ నోటీసును సృష్టించిన బీఆర్ఎస్​ నాయకుడు మన్నె క్రిశాంక్‌పై ఓయూ అధికారులు వర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాము జారీ చేసిన సర్క్యూలర్​‌కు బదులు ఫేక్​ సర్క్కూలర్‌​ను తయారు చేసి సోషల్‌ మీ​మీడియాలో పెట్టి వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు వార్తను ప్రచారం చేసిన క్రిశాంక్‌​పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఓయూ చీఫ్​ వార్డెన్ శ్రీనివాస్​ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read Also : AP : కాళ్లు పట్టుకునే స్థాయికి దిగజారిన వైసీపీ నేతలు..