Site icon HashtagU Telugu

KTR : కాంగ్రెస్ డబ్బులు ఇస్తే తీసుకోండి.. కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్‌కే వేయండి..

Protests Of IT Employees

KTR Meeting with Khammam Bhadradri Leaders in Telangana Bhavan Interesting comments on Congress

తెలంగాణలో(Telangana) ఎలక్షన్స్(Elections) దగ్గరికి వస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు, ఒక పార్టీపై ఇంకో పార్టీ విమర్శలు చేస్తున్నారు. నేడు తెలంగాణ భవన్ లో ఖమ్మం(Khammam), భద్రాద్రి జిల్లాల నాయకులు, కార్యకర్తలతో కేటీఆర్(KTR) సమావేశం అవ్వగా ప్రతిపక్షాల పార్టీలపై ఫైర్ అయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ గ్యారెంటీ హామీల గురించి, కాంగ్రెస్ నాయకుల గురించి మాట్లాడుతూ విమర్శలు చేశారు.

కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఒక్క చాన్స్ అంటూ కొత్త డ్రామాలు చేస్తోంది. ఇప్పటిదాకా 11 సార్లు ఛాన్స్ ఇస్తే ఏం చేశారు? ఏదో ఒకటి చేసి అధికారం దక్కించుకునే తాపత్రయంలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క పథకం అయినా అమలు చేస్తున్నారా? ఆరు గ్యారెంటీలు అంటున్న కాంగ్రెస్ లో ఎవరు సీఎం అనేది గ్యారంటీ లేదు. కాంగ్రెస్ కు ఓటేస్తే దివాళా తీయడం గ్యారంటీ. వారి హామీలు రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్జువే. మీకు అనుమానం ఉంటే కర్ణాటకలో కనుక్కోండి. అక్కడ ఎస్సీ,ఎస్టీలకు శఠగోపం పెడుతుంది. కర్ణాటకలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. అభివృద్ధి కోసం పైసా లేదని ఆ రాష్ట్రం మంత్రులే అంటున్నారు. మోడీ వచ్చినా, రాహుల్ వచ్చినా తెలంగాణలో అబివృద్ది ఎవరు కాదనలేరు. మొండి చెయ్యితో ఆరు గ్యారెంటీలు చెప్పినా… అభివృద్ధి గురించి ఒక్కటి కూడా చెప్పలేదు. ప్రజలను అయోమయంలో వేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది అని అన్నారు.

ఇక ఖమ్మం నాయకులను ఉద్దేశించి.. పార్టీ నుంచి వెళ్ళిపోయినా వాళ్ళు తమ బాధని ప్రజల బాధగా చెప్పుకుంటున్నారు. 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి తాగునీటిని ఎందుకు ఇవ్వలేదు. ఖమ్మంలో గులాబీ జెండా ఎగిరితే నిధులు అవే వస్తాయి. ఖమ్మం ప్రజాలు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలి. కాంగ్రెస్ నేతలు ఓట్లకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. కాంగ్రెస్ నేతలు డబ్బులిస్తే తీసుకోండి… కానీ బీఆర్ఎస్‌కే ఓటు వేయండి అని అన్నారు. దీంతో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

 

Also Read : Telangana: కాంగ్రెస్ హామీలు సంతకం లేని చెక్: హరీష్