KTR : కాంగ్రెస్ పార్టీకి అసలైన సినిమా ముందుంది – కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS)..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో (Lok Sabha Elections) విజయం సాధించి కసి తీర్చుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR)..వరుసపెట్టి నియోజకవర్గాల నేతలతో సమావేశం అవుతూ..ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందామని నిరాశ పడొద్దని..ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకుని ముందుకు వెళ్లాలని వారిలో ధైర్యం నింపుతున్నారు. బుధువారం వరంగల్‌ లోక్‌సభ (Warangal Lok Sabha) నియోజకవర్గంపై తెలంగాణ భవన్‌లో […]

Published By: HashtagU Telugu Desk
Ktr Palrament

Ktr Palrament

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ (BRS)..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో (Lok Sabha Elections) విజయం సాధించి కసి తీర్చుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR)..వరుసపెట్టి నియోజకవర్గాల నేతలతో సమావేశం అవుతూ..ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందామని నిరాశ పడొద్దని..ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకుని ముందుకు వెళ్లాలని వారిలో ధైర్యం నింపుతున్నారు.

బుధువారం వరంగల్‌ లోక్‌సభ (Warangal Lok Sabha) నియోజకవర్గంపై తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ..కొన్నితప్పిదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. ఇప్పుడు తెలంగాణ ఢిల్లీ చేతుల్లోకి వెళ్లింది. తెలంగాణను మన చేతుల్లోకి తెచ్చుకునే అవకాశం వచ్చిందని నేతల్లో ఉత్సాహం నింపారు. కాంగ్రెస్‌ పార్టీవి ఆరు గ్యారంటీలు కాదు, 420 అబద్ధాలన్నారు. కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని వారి 420 మ్యానిఫెస్టోతోనే ఎండగట్టాలన్నారు. ఆ పార్టీకి అసలైన సినిమా ముందుందని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్‌ పార్టీ హామీలను ప్రజలు నేడు నమ్మే పరిస్థితులో లేరని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీఆర్‌ఎస్‌ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలువాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల ఏర్పాటును రద్దు చేస్తామని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అలా చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. విధ్వంసమైన తెలంగాణను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పదేండ్ల పాలనలో వికాసం వైపు నడిపించారు. రాష్ట్రాభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే పార్టీ శ్రేణులకు తక్కువ సమయం కేటాయించాల్సి వచ్చిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Read Also : TSRTC : ఆర్టీసీ సిబ్బంది ఫై దాడి చేస్తే..తీవ్ర పరిణామాలు ఎదురుకుంటారు – సజ్జనార్

  Last Updated: 10 Jan 2024, 03:38 PM IST